NTV Telugu Site icon

Russia: సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని మోడీ

N

N

ప్రధాని మోడీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లారు. సోమవారం ప్రధాని మోడీకి మాస్కోలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి మోడీ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

ఇది కూడా చదవండి: Madhya Pradesh: “నలుపు”గా ఉన్నాడని భర్తను, పసిబిడ్డని విడిచి వెళ్లిన భార్య..

భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. సమ్మిట్ చర్చలకు ముందు ప్రధాని మోడీ, అధ్యక్షుడు పుతిన్ ఆల్ రష్యన్ ఎగ్జిబిషన్ సెంటర్‌ను సందర్శించారు. భారతదేశం, రష్యా మధ్య సహకారానికి ఇంధనం ఒక ముఖ్యమైన స్తంభమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మాస్కోలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి రోసాటమ్ పెవిలియన్‌ను సందర్శించినందున మాస్కోతో ఈ రంగంలో సంబంధాలను మరింత సుస్థిరం చేసుకోవడానికి ఢిల్లీ ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. ఇది శాస్త్రీయ మరియు సాంకేతిక పరిణామాల చరిత్రలో అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.