PM Modi:రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర కావస్తోంది. తొలిసారిగా భారత ప్రధాని నరేంద్రమోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీతో తొలిసారి భేటీ అయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ, జెలెన్స్కీ మధ్య వ్యక్తిగతంగా భేటీ కావడం ఇదే తొలిసారి. జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సుకు అతిథిగా ప్రధాని మోడీ వెళ్లారు. జపాన్ వేదికగా ఇరు దేశాల నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు.
Read Also: Care Hospital: కేర్ ఆస్పత్రిలో కేర్ కనెక్ట్.. అవయవ మార్పిడి రోగుల ఆత్మీయ సమ్మేళనం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా భారత్ మాత్రం రష్యాతో స్నేహంగానే ఉంటోంది. మరోవైపు ఈ యుద్ధానిక పరిష్కారం చూపాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో పాటు ఉక్రెయిన్ ఇతర మంత్రులు ప్రధాని మోడీని కోరాయి. అయితే శాంతి ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలతో పలుమార్లు మాట్లాడారు. గతేడాది అక్టోబరు 4న జెలెన్స్కీతో ఫోన్ సంభాషణలో, “సైనిక పరిష్కారం” ఉండదని, ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా భారత్ సహకరించేందుకు సిద్ధంగా ఉందని మోడీ అన్నారు.
శనివారం ప్రధాని మోడీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్ చిన్ లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జీ 7 దేశాల కూటమిలో భారత్ కు సభ్యత్వం లేకున్నా, జపాన్ ప్రధాని కిషిడా ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశం వెళ్లారు.
