Site icon NTV Telugu

PM Modi: ముగిసిన మోడీ జపాన్ టూర్.. చైనాకు పయనం

Modi2

Modi2

ప్రధాని మోడీ రెండు రోజుల జపాన్ పర్యటన ముగిసింది. శుక్రవారం టోక్యో వ్యాపార వేత్తల సమావేశంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపునిచ్చారు. శనివారం బుల్లెట్ ట్రైన్‌లో జపాన్‌ ప్రధాని ఇషిబాతో కలిసి విహరించారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చలు జరిగాయి.

జపాన్ పర్యటన ముగియడంతో మోడీ చైనాకు బయల్దేరారు. చైనాలోని టియాంజిన్‌కు విమానంలో బయల్దేరారు. ఇక చైనాకు బయల్దేరే ముందు మోడీకి జపాన్ ప్రధాని ఇషిబా ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరవుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పుతిన్, మోడీ ఒకే వేదికపై కలవనున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్తున్నారు.

ఇది కూడా చదవండి: Hamas-Israel: అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి వీడియోను విడుదల చేసిన నెతన్యాహు.. ఎందుకోసమంటే..!

టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో  శిఖరాగ్ర సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో మోడీ సమావేశం కానున్నారు.  చైనాలో జరిగే సమ్మిట్‌కు 11 దేశాల నేతలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఇక ఇందులో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఉన్నారు. ఈ సమ్మిట్‌కు ఎస్‌సీవో దేశాలతో పాటు నేపాల్, మాల్దీవులు, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, మంగోలియా, తుర్క్‌మెనిస్తాన్, లావోస్, అర్మేనియా, అజర్‌బైజాన్ నాయకులంతా సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. చైనాలో టూర్‌లో భాగంగా తొలిసారి జిన్‌పింగ్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

 

Exit mobile version