PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రాబోతోంది. రికార్డు స్థాయిలో వరసగా మూడోసారి అధికారంలోకి వస్తూ చరిత్ర సృష్టించింది. భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఈ ఫీట్‌ని పునరావృతం చేసిన వ్యక్తిగా నరేంద్రమోడీ రికార్డు సృష్టించారు. ఇదిలా ఉంటే, ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోడీకి, ఎన్డీయే కూటమి, బీజేపీకి ప్రపంచదేశాధినేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Also: PM Modi: ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం..
ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి చైనా బుధవారం అభినందనలు తెలిపింది, పొరుగుదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. రెండు దేశాలు మరియు ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రెండు దేశాల మధ్య సంబంధాల యొక్క ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి భారత్‌తో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ పేర్కొంది.
ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోడీకి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశం, ఇజ్రాయిల్ సంబంధాలు మరింత ఎత్తుకు చేరుకోవాలని ఆయన కాంక్షించారు. తైవాన్ ప్రెసిడెంట్ ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. ఇండో-పసిఫిక్ లో శాంతి, శ్రేయస్సు అందించడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు.
