G20 Summit: బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జీ20 సదస్సు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఈ సమ్మిట్ తర్వాత సంప్రదాయంగా ప్రపంచ దేశాధినేతలు దిగే ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, ఫొటో దిగే సమయంలో బైడెన్, ట్రూడోలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరుపుతున్నట్లు సమాచారం.
Read Also: Mahesh Babu : నయనతార వివాదం.. ఆసక్తి రేపుతున్న మహేష్ ఇన్‌స్టా పోస్ట్
అయితే, సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నాయకులంతా రాక ముందే పలువురు దేశాధినేతలు ఫోటో దిగేశారని అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పుకొచ్చారు. చివరకు జో బైడెన్, జస్టిన్ ట్రూడో, జార్జియా మెలోనీలు ప్రత్యేకంగా ఫోటో దిగారు. ఇక, యూఎస్ అధ్యక్షుడిగా జో బైడెన్‌కు చివరి జీ20 సమ్మిట్ అయినందున ఆయన ఫొటోలో కనిపించకపోవడం ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం గైర్హాజరు అయ్యారు.