NTV Telugu Site icon

Russia: ‘‘నిప్పుతో చెలగాటం’’.. ట్రంప్ హత్యాయత్నంపై రష్యా స్పందన..

Trump Assassination Attempt

Trump Assassination Attempt

Russia: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరుపు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి హత్యాయత్నం నుంచి బయటపడట్టారు. కొన్ని వారాల ముందు పెన్సిల్వేనియాలోని ఓ ప్రచారంలో మాట్లాడుతున్న సందర్భంగా ట్రంప్‌పై కాల్పులు జరిగాయి, ఈ దాడిలో బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది, తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.

తాజాగా ఫ్లోరిడాలో ఆదివారం ట్రంప్ ఈ హత్యాయత్నం నుంచి తప్పించుకున్నట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సరిహద్దు దగ్గర సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరపడంతో 58 ఏళ్ల అనుమానితుడు ర్యాన్ వెస్లీ రౌత్ పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. ఘటనా స్థలం నుంచి పవర్ ఫుల్ AK-47 తరహా రైఫిల్ మరియు గోప్రో కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు తమ కస్టడీలో ఉన్నట్లు పామ్ బీచ్ కౌంటీ షరీప్ రిక్ బ్రాడ్ షా తెలిపారు.

Read Also: Fraud: హిందువుగా నటించి మహిళతో పెళ్లి.. ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి..

ఇదిలా ఉంటే, ట్రంప్ హత్యాయత్నం గురించి రష్యా స్పందించింది. మాజీ అధ్యక్షుడిని హత్య చేయాలని భావించిన ర్యాన్ వెస్లీ రౌత్‌కి ఉక్రెయిన్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడ్డాయి. ఈ లింకులపై సోమవారం రష్యా స్పందిస్తూ.. ట్రంప్ ‘‘అగ్నితో ఆడుకోవడం’’ వంటి పరిణామాలను కలిగి ఉన్నాడని పేర్కొంది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ని ట్రంప్ హత్యాయత్నం గురించి ప్రశ్నించగా… ‘‘ ఆలోచించాల్సింది మనం కాదు. అమెరికా ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ నిప్పుతో చెలగాటం వంటి పరిణామాలను కలిగి ఉంటుంది’’ అని అన్నారు.

న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ కథనాల ప్రకారం.. ర్యాన్ వెస్లీ రౌత్(58) పేరుతో మూడు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. వీటిలో అతను రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ తరుపున పోరాడేందుకు, మరణించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఉక్రెయిన్ తరుపున పోరాడేండుకు ఆఫ్ఘన్ ఫైటర్లను నియమించుకునేందుకు ప్రయత్నించిన విషయాన్ని కూడా అతను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ఏడాది కొన్ని వారాల తేడాలో ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నాలు జరగడం అగ్రరాజ్యంలో ఆందోళన కలిగిస్తున్నాయి.