NTV Telugu Site icon

Manchester Flight Incident: గాల్లో ఉన్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు.. 11 మందికి గాయాలు

Plane Dropped

Plane Dropped

గాల్లో ఉండగానే విమానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవ్వడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో విమానాన్ని అత్యవసర పరిస్థితిలో ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటనలో 11 మంది ప్రయాణికులు గాయపడగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎయిర్‌పోర్టు అధారిటీ పేర్కొంది. ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Also Read: London Nanny: ఈ ఆయా జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే.. ప్రైవేట్ జెట్‌లో టూర్లు.. స్పెషల్‌గా డ్రైవర్ కూడా..

వివరాలు.. కరేబియన్‌ ద్వీపంలోని బార్బడోస్ నుంచి మాంచెస్టర్‌కు మలెత్ ఏరో ఫ్లయిట్ బయలుదేరింది. డిసెంబర్ 24న 225 మంది ప్రయాణికులతో కరేబియన్ ద్వీపం బార్బడోస్ నుంచి ఒక గంట ఆలస్యంగా బయలుదేరింది. ఉదయం 6 గంటలలోపు మాంచెస్టర్‌కు చేరుకోవాల్సి ఉండగా.. బయలుదేరిన రెండు గంటల తర్వాత విమానంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఈ ఎయిర్‌బస్ విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. దీంతో పైలెట్లు విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ కోసం దగ్గర్లోని బెర్మాడాకు మళ్లీంచారు. అక్కడ విమానం ల్యాండ్‌ అవుతుండగా 11 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరికి బర్ముడాలో చికిత్స అందించారు. అయితే సిబ్బందికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.

Also Read: Prof. Aditya Mukherjee : మతోన్మాద శక్తులు నెహ్రూపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయి