Site icon NTV Telugu

USA: కుక్క ఎంత పనిచేసింది.. తుపాకీతో కాల్చి వ్యక్తిని చంపింది..

Dog Kills Man

Dog Kills Man

Pet Dog Shoots, Kills US Man Out On Hunting Trip: కుక్క తుపాకీని పేల్చుతుందని ఎవరైనా అనుకుంటారా..? కానీ ఇలా తుపాకీ కాల్పులకు ఓ కుక్క కారణం అయింది. తుపాకీని పేల్చి ఓ వ్యక్తిని హత్య చేసింది. ఈ ఘటన అమెరికాలోని సెంట్రల్ రాష్ట్రం అయిన కాన్సాస్ లో జరిగింది. బాధిత వ్యక్తి అతని పెంపుడు జంతువు శనివారం సరదాగా వేటకు విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది.

Read Also: Gujarat Riots Case: గుజరాత్ అల్లర్ల కేసులో 22 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు..

పికప్ ట్రక్ వెనకాల యజమానికి చెందిన గన్ ఉంది. డ్రైవింగ్ సీట్ లో వ్యక్తి కూర్చోని ఉన్నాడు. ఈ సమయంలో కుక్క వెనకాల ఉన్న రైఫిల్ పై కాలు వేయడంతో ఒక్కసారిగా ఫైర్ అయింది. ముందున్న వ్యక్తి శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో గాయపడిన వ్యక్తి అక్కడిక్కడే మరణించినట్లు సమ్నర్ కౌంటీ షరీఫ్ కార్యాలయం తెలిపింది.

ఈ ఘటనపై విచారణ కొసాగిస్తున్నారు పోలీసులు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తిని 30 ఏళ్ల వయసు కలిగినవాడిగా గుర్తించారు. అయితే కుక్క, అతని పెంపుడు కుక్కా కాదా..? అనే సంగతిపై పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అమెరికాలో మనుషుల కన్నా తుపాకులు సంఖ్యే అధికంగా ఉంది. దీంతో ఇటీవల పలు చోట్ల కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. గడిచిన రెండు రోజుల్లో అమెరికాలో మూడు చోట్ల కాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపుగా 19 మంది ప్రజలు మరణించారు.

Exit mobile version