NTV Telugu Site icon

Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియే హత్యపై తీవ్రంగా స్పందించిన ఇరాన్..

Ismail Haniyeh

Ismail Haniyeh

Ismail Haniyeh: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని గుర్తుతెలియని వ్యక్తులు ఇరాన్ టెహ్రాన్ నగరంలో కాల్చి చంపారు. ఈ హత్యపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. తన ప్రాధేశిక సమగ్రతను, గౌరవాన్ని కాపాడుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. ఇరాన్, పాలెస్తీనా బంధం గతంలో కన్నా చాలా బలంగా ఉందని ఆయన అన్నారు. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చిన హనియేని దాడి చేసి చంపారు.

‘‘ఈ రోజు, ఇరాన్ తన బాధలు మరియు ఆనందాలను పంచుకునే వ్యక్తిని, ప్రతిఘటన మార్గంలో నిరంతరం మరియు గర్వించదగిన సహచరుడు, పాలస్తీనా ప్రతిఘటన యొక్క ధైర్య నాయకుడు, అల్-ఖుద్స్ యొక్క అమరవీరుడు, హజ్ ఇస్మాయిల్ హనియేహ్‌ని నిన్న నేను నా భుజాల మీద సమాధి చేసాను. ఇరాన్, పాలస్తీనా రెండు గర్వించదగిన దేశాల మధ్య బంధం మరింత బలపడుతుంది అణచివేతకు గురైన వారి ప్రతిఘటన మరియు రక్షణ గతంలో కంటే బలంగా అనుసరించబడుతుంది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ తన ప్రాదేశిక సమగ్రత, గౌరవం, గర్వాన్ని కాపాడుతుంది. తీవ్రవాద ఆక్రమణదారులు వారి పిరికి చర్యకు పశ్చాత్తాపపడేలా చేస్తుంది’’ అని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంతాప సందేశాన్ని ఇచ్చారు.

Read Also: Srisailam Inflow: శ్రీశైలానికి తగ్గిన వరద.. 8 గేట్ల ద్వారా నీటి విడుదల

మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ హస్సేనీ ఖమేనీ తన సంతాపాన్ని తెలియజేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా హనియే మృతికి సంతాపం తెలియజేస్తూ.. ఆయన రక్తం, త్యాగం వృథా కాబోనివ్వమని చెప్పింది. ఖతార్ విదేశాంగ శాఖ కూడా ఇస్మాయిల్ హనియే హత్యను తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాల్ని స్పష్టంగా ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించింది. పౌరులను హత్య చేయడం ఈ ప్రాంతంతో మరింత అహింసకు దారి తీస్తుందని చెప్పింది. రష్యా దీనిని ‘‘ఆమోదించలేని రాజకీయ హత్య’’గా అభివర్ణించింది.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తమ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ హత్యకు గురైన తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రతిజ్ఞ చేసింది. హనియే హత్యకు ఇజ్రాయెల్‌ను నిందించింది. ఇతర పాలస్తీనియన్ గ్రూపులు కూడా హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ హత్యను ఖండించాయి. దీనికి ఇజ్రాయిల్ మూల్యం చెల్లించుకుంటుందని పరోక్షంగా హెచ్చరించింది. లెబనాన్ హిజ్బోల్లా హనియే హత్య తమ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని పేర్కొంది.