NTV Telugu Site icon

Australian Beach Mystery: ఆస్ట్రేలియా ఒడ్డున భారత్‌ PSLV రాకెట్‌ భాగం.. ప్రకటించిన ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ

Australian Beach

Australian Beach

Australian Beach Mystery: ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు భారత్‌కు చెందిన పీఎస్‌ఎల్‌వీ కి చెందిన శకలంగా ఆస్ర్టేలియా స్పేస్‌ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పరీక్షలను నిర్వహించిన అనంతరం స్పేస్‌ అధికారులు ప్రకటించారు. ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు మిస్టరీ వీడింది. అది భారత్‌కు చెందిన రాకెట్‌దేనని అక్కడి అధికారులు ప్రకటించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమీపంలో జులై మధ్యవారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. ఆరు ఫీట్ల ఎత్తు.. కేబుల్స్‌ వేలాడుతూ కనిపించింది. ఆ సమయంలో ఇది చంద్రయాన్‌-3కి చెందిన శకలం అంటూ ప్రచారాలు చేశారు. ఇంకొందరు తొమ్మిదేళ్ల కిందట అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ MH 370 విమానందేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియన్‌ స్పేస్‌ ఏజెన్సీ దానిని అధ్యయనం చేసి సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది.

Read also: Nee Jathai Song: ఏజెంట్ బ్యూటీతో మెగా ప్రిన్స్ రొమాన్స్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంఛ్‌ వెహికిల్‌(PSLV)కి చెందిన శకలమని ఆస్ర్టేలియా స్పేస్‌ అధికారులు ప్రకటించారు. అయితే.. దీనిపై అధికారికంగా అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోకి లోబడి ఇరు దేశాలు సంయుక్త ప్రకటన వెలువరించాల్సి ఉందని ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ చెబుతోంది. తాము పరిశీలించిన తర్వాతే ప్రకటన చేస్తామని ఇస్రో ఇదివరకే ప్రకటించగా.. అది ఎప్పటిది అనే దానిపై ఇస్రో అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. PSLV ప్రయోగ దశల్లో ఇలా శలాలను సముద్రంలో పడేయడం సర్వ సాధారణంగా జరిగేదే. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా తీరానికి ఇలాంటి స్పేస్‌ జంక్‌ కొట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. గత ఆగష్టులో ఎలన్‌ మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ రాకెట్‌ శకలం న్యూసౌత్‌వేల్స్‌లోని ఓ గడ్డి మైదానంలో
పడగా.. ఓ గొర్రెల కాపరి దానిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు. ఆ తరువాత అధికారులు పరీక్షలు నిర్వహించి అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు కూడా అలాగే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.