బ్యాంక్ అకౌంట్లలో ఉన్నట్టుండి నగదు మాయం అయితే ఎలా ఉంటుంది. తమ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు సడన్‌గా మాయం అయితే గుండె ఆగినంత పని అవుతుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేశారా? లేదంటే ఇంకెవరైనా దోచుకున్నారా? అన్న భయంతో తీవ్ర ఆందోళన చెందుతాం. ఇలాంటి పరిస్థితే అమెరికాలో కస్టమర్లకు ఎదురైంది. వేలాది మంది బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాదారులకు ఈ పరిణామం ఎదురైంది.
ఇది కూడా చదవండి: Central Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలు
బ్యాంక్ ఆఫ్ అమెరికా సేవల్లో బుధవారం మధ్యాహ్నం పెద్దఎత్తున అంతరాయం ఏర్పడింది. కస్టమర్లు తమ ఆన్‌లైన్ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఖాతాలో బ్యాలెన్స్ కనిపించడం లేదంటూ ఆందోళన చెందారు. కొందరి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, డల్లాస్, ఫీనిక్స్, హ్యూస్టన్, చికాగో వంటి ప్రధాన నగరాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ‘‘ఖాతాలు తాత్కాలికంగా అందుబాటులో లేవు’’ అని కొంతమందికి.. బ్యాంకింగ్ యాప్‌లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ‘‘కనెక్షన్ ఎర్రర్’’ అని చాలా మందికి మెసేజ్ చూపించింది.
ఇది కూడా చదవండి: Classical language: మరాఠీ, బెంగాలీతో సహా 5 భాషలకు “క్లాసికల్ హోదా”.. 11 చేరిన సంఖ్య..
కస్టమర్లు తమకు తలెత్తిన ఇబ్బందులను ‘ఎక్స్’ (ట్విటర్), సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. బ్యాంకు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్లు సమస్య ఎదురైనట్లు సీఎన్‌ఎన్ వార్త సంస్థకు ఇచ్చిన వివరణలో బ్యాంక్ ఆఫ్ అమెరికా అంగీకరించింది. సమస్యను పరిష్కరిస్తున్నామని, ఖాతాదారులకు క్షమాపణలు చెబుతున్నామని బ్యాంక్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Veekshanam Teaser: ఆసక్తికరంగా “వీక్షణం” టీజర్