NTV Telugu Site icon

Pakistan: ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న బిలావల్ భుట్టో.. తీవ్ర దుమారం..!

Butto

Butto

Pakistan: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ గురించి స్పందించారు. క్వెట్టాలో విలేకరుల సమావేశంలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పారదర్శకత కొరవడింది.. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికలు పాకిస్తాన్ చరిత్రలో అతి పెద్ద రిగ్గింగ్‌ జరిగిందని పేర్కొన్నారు. రాజకీయ ఏకాభిప్రాయం ద్వారా ఎన్నికల్లో రిగ్గింగ్ పునరావృతమయ్యే సమస్యను ముగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కోరుకోవాలని బిలావల్ భుట్టో సూచించారు.

Read Also: Kalki 2898 AD: రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు… కల్కి కలెక్షన్స్ ఎంతంటే ..?

ఇక, ఎన్నికల సంస్కరణలను సమర్థించడంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పాత్రను కూడా బిలావల్ భుట్టో జర్దారీ గుర్తించారు. ప్రత్యర్థి పార్టీలు లేదా వ్యక్తిగత రాజకీయ నాయకుల నుంచి అప్పుడప్పుడు అడ్డంకులు ఎదురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ట్రిబ్యునల్స్‌లో కొనసాగుతున్న ఎలక్షన్ మోసాల కేసులను ఎత్తి చూపుతూ.. న్యాయమైన ఎన్నికల పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. ఆరోగ్య సంరక్షణలో సింధ్ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా బిలావల్ ప్రశంసించారు.

Read Also: AR Rahman : వారి వల్ల ఉద్వేగానికి లోనయ్యాను.. ఏఆర్ రెహమాన్..

అయితే, క్వెట్టాలో కూడా మెరుగైన వైద్యం, సమాన విద్యను అక్కడి నివాసితులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇదే విధమైన జరుగుతుందని పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో అన్నారు. ఇక, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ యొక్క మేనిఫెస్టోను గుర్తు చేస్తూ.. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) రద్దుపై పార్టీ వైఖరిని పునరుద్ఘాటించారు.. న్యాబ్ పొలిటికల్ ఇంజినీరింగ్, ప్రతీకార వ్యూహాలు, రాజకీయ నాయకుల ప్రతిష్టను దిగజార్చిందని ఆయన విమర్శించారు. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య ప్రక్రియలను ప్రతికూలంగా ప్రభావితం చేసిందని బిలావల్ భుట్టో పేర్కొన్నాడు.