NTV Telugu Site icon

Titan Tragedy: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. పాకిస్తాన్ టైకూన్ “టైటాన్”కు బలైయ్యాడు

Shahzada Dawood

Shahzada Dawood

Titan Tragedy: అట్లాంటిక్ సముద్రంలో మునిపోయిన టైటానిక్ షిప్ ను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో బయలుదేరిన ‘టైటాన్’ సబ్‌మెర్సిబుల్ ప్రమాదానికి గురైంది. సముద్రం అడుగు భాగంలో 4 కిలోమీటర్ల లోతులో పేలిపోయింది. ఈ ప్రమాదంలో పాకిస్తానీ బిజినెస్‌మ్యాన్ కూడా చనిపోయాడు. పాకిస్తానీ – బ్రిటిష్ ధనవంతుడు షాహజాదా దావూద్, అతని కుమారుడు 19 ఏళ్ల సులేమాన్ దావూద్ మరణించిన ఐదుగురిలో ఉన్నారు.

తీవ్ర ఒత్తడి కారణంగా టైటాన్ పేలిపోయి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన శిథిలాలను యూఎస్ కోస్ట్ గార్డ్ కనుగొంది. కమ్యూనికేషన్ కట్ అయిన కొద్ది సేపటికే సముద్రం లోపలి నుంచి పేలుడు శబ్ధాన్ని విన్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే షహజాదా దావూద్ మాత్రం విధిని తప్పించుకోలేకపోయాడు. 2019లో షహజాదా ప్రయాణిస్తున్న విమానం ఘోర ప్రమాదాన్ని తృటితో తప్పించుకుంది. ఆ సమయంలో షహజాదా చావు నోట్లో వరకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం షహజాదా భార్య క్రిష్టిన్ దావూద్ ఆ భయంకరమైన ఘటనను గుర్తు చేసుకున్నారు.

Read Also: Bangalore: డీకే శివకుమార్‌ తో కోమటిరెడ్డి భేటీ.. కర్ణాటక చేరిన టీ కాంగ్రెస్‌ రాజ’కీ’యం

2019లో ఓ తుఫాను గుండా వెళ్తున్న సమయంలో విమానం ప్రమాదానికి లోనైంది. ఆనాటి ఘటనలను క్రిస్టిన్ ‘ లివింగ్ విత్ యాంగ్జైటీ’ పేరుతో ఓ బ్లాగ్ లో ఆనాటి విషయాలను నెమరేసుకున్నారు. ఈ సమయంలో విమానం ఒక్కసారి 3 నుంచి 5 మీటర్ల వేగంగా కిందికి పడిపోయిందని తెలిపారు. సీటు బెల్టు పెట్టుకోవాలని విమానంలో వార్నింగ్ సిగ్నల్స్ వచ్చాయని, విపరీతమైన టర్బులెన్స్ కారణంగా విమానం చాలా ఒడిదొడుకులకు లోనైందని, ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు భయంతో ఏడవడం ప్రారంభిచారని ఆ బ్లాగ్ పోస్టులో రాసుకొచ్చారు.

విమానం వేగంగా అస్థిరంగా కదలడం, పెద్ద శబ్ధాలు చేయడంతో భయపడిపోయినట్లు.. ఆ సమయంలో దేవుడా మమ్మల్ని క్షేమంగా ల్యాండ్ చేస్తే, జన్మలో సిగరెట్లు ముట్టనని ప్రమాణం చేశానని చెప్పుకొచ్చారు. ఈ విమాన ప్రమాదంలో తన తలకు గాయాలు అయ్యాయని, ఆ సమయంలో పైలట్లు చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేసినట్లు బ్లాగ్ లో పేర్కొన్నారు. ఇంతటి విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న షహజాదా దావూడ్.. ఆదివారం జరిగిన టైటాన్ ప్రమాదం నుంచి మాత్రం బయటపడలేకపోయాడు. దాదాపుగా 4 కిలోమీటర్ల సముద్రం లోతులో చనిపోయాడు.