Pakistan TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan TV Anchor: పాకిస్థాన్‌లో మహిళలపై హింసకు సంబంధించిన మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ టెలివిజన్ యాంకర్, ప్రోగ్రామ్ హోస్ట్ రాబియా ఎహసాన్ (41) తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. రావల్పిండిలోని గుల్షన్బాద్ ప్రాంతంలో ఆదివారం ఆమె తన ఇంట్లోనే మృతిచెంది కనిపించారు. ఈ ఘటన పాకిస్థాన్ మీడియా రంగంలో తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసులో ఆమె భర్త ఎహసాన్ తాహిర్ ఖాన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్థాన్‌కు చెందిన ‘సమా’ ఛానల్ కథనం ప్రకారం.. రాబియా ఎహసాన్ హత్యకు సంబంధించి పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. సిటీ పోలీస్ ఆఫీసర్ (సీపీఓ) హసన్ ముష్తాక్ సుఖేరా మాట్లాడుతూ.. అనుమానిత ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో పనిచేసే పురుష ఉద్యోగి ఇచ్చిన సమాచారం ప్రకారం.. కాల్పులు ప్రమాదవశాత్తు జరిగాయని రాబియా భర్త చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
- Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్‌పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
- Nvidia CEO Controversy: 'నేను నా భార్యకు ద్రోహం చేశాను,'.. చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమేనన్న ఎన్విడియా సీఈఓ
- Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
- Iran Nuclear Talks: ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
‘డాన్’ వార్తా కథనం ప్రకారం.. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధమే హత్యకు ఉపయోగించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఎహసాన్ తాహిర్ ఖాన్.. తాను పిస్టల్‌ను పట్టుకుని ఉండగా అది అనుకోకుండా పేలిందని, అందులో బుల్లెట్ లోడ్ అయి ఉందనే విషయం తనకు తెలియదని చెప్పినట్లు నివేదిక పేర్కొంది.
అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ఏజెన్సీ (PFSA) బృందాలు ఘటనాస్థలం నుంచి ఆధారాలు సేకరిస్తున్నాయి. రాబియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
రాబియా ఎహసాన్ వయస్సు 41 సంవత్సరాలు. ఆమె పాకిస్థాన్‌కు చెందిన ’92 న్యూస్’ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్లో యాంకర్‌గా, ప్రోగ్రామ్ హోస్ట్‌గా పనిచేశారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు అమీర్ మతీన్, రౌఫ్ క్లాస్రాలతో కలిసి కరెంట్ అఫైర్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆమెకు 13, 11 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాల్పుల ఘటన జరిగిన సమయంలో పిల్లలు తమ అమ్మమ్మతో కలిసి ఇంటి లాన్లో ఉన్నట్లు ‘డాన్’ కథనం వెల్లడించింది.
రాబియా ఎహసాన్ హత్యపై పాకిస్థాన్ ఫస్ట్ లేడీ ఆసిఫా భుట్టో జర్దారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న హింసను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో పూర్తి స్థాయి, నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఘటన వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి రావాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Pakistan TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం.. 2024 కంటే మెరుగైన ఫలితాలు!
-
Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Anirudh-Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే.. వివాహం తేదీ, స్థలం, పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!