Site icon NTV Telugu

UAE Plane Crash: యూఏఈలో విమాన ప్రమాదం.. భారత సంతతి వైద్యుడి సహా ఇద్దరు మృతి

Uaeplanecrash

Uaeplanecrash

ఈ ఏడాది చివరిలో వరుస విమాన ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో పదులకొద్ది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్‌లో ఆయా ఘటనల్లో దాదాపుగా ఇప్పటి వరకు 233 మంది మృతిచెందారు. ఆదివారం దక్షిణ కొరియాతో పాటు యూఏఈలో కూడా విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 26 ఏళ్ల భారత సంతతికి చెందిన వైద్యుడు సులేమాన్ అల్ మజీద్ సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Delhi: పబ్లిక్ ప్లేస్‌లో మందు తాగొద్దని చెప్పినందుకు కానిస్టేబుల్ హత్య..

న్యూఇయర్ వేడుకలు ఎంజాయ్ చేసేందుకు సులేమాన్.. ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకుని విహరించేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లాడు. ఎయిర్‌పోర్టులోని ఏవియేషన్ క్లబ్‌లో తల్లిదండ్రులు, సోదరుడిని ఉంచి.. సులేమాన్.. పాకిస్థాన్ మహిళా పైలట్‌తో కలిసి విమానంలో వివహరిస్తున్నారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. బీచ్ వెంబడి కోవ్ రొటానా హోటల్ సమీపంలో విమానం కూలిపోయినట్లుగా ఏవియేషన్ అథారిటీ తెలిపింది. ఈ ప్రమాదంలో సులేమాన్ సహా పాకిస్థాన్ మహిళా పైలట్ ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: August 2024 Movie Roundup: హేమ కమిటీ బాంబ్.. నాగచైతన్య నిశ్చితార్థం

ఆదివారం జరిగిన ప్రమాద వివరాలను అధికారులు తాజాగా వివరాలు వెల్లడించారు. ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. తదుపరి రైడ్‌కి తల్లిదండ్రులు, సోదరుడు వెళ్లాల్సి ఉండగా ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడుపుదామని వచ్చి.. కుమారుడు మరణవార్త విని తల్లడిల్లిపోయారు. సులేమాన్ యూఏఈలోనే పుట్టి పెరిగాడు. అయితే కుటుంబంతో కలిసి విహరించడం కోసం విమానాన్ని అద్దెకు తీసుకుంటే ఇలాంటి ఘోరం సంభవించింది. సులేమాన్ మృతితో మా జీవితాలు ఛిద్రమయ్యాయని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి: 2024లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్లు ఎవరంటే..? (అన్ని ఫార్మాట్లలో)

Exit mobile version