Site icon NTV Telugu

Pakistan: కరాచీ ఫ్లైట్ టికెట్ కొంటే, సౌదీలో దిగాడు.. పాకిస్తాన్‌లో ఇంతే కావచ్చు..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ లో విచిత్రం చోటుచేసుకుంది. కరాచీకి వెళ్దామని విమానం ఎక్కితే, ఏకంగా సదరు వ్యక్తి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో దిగాడు. పాకిస్తాన్ విమానయాన రంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక దేశీయ ప్రయాణికుడి వద్ద వీసా, పాస్‌పోర్టు లేకుండా సౌదీ వెళ్లే విమానంలోకి ఎలా అనుమతించారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Read Also: Tesla: దేశంలోకి ఈ రోజే టెస్లా ఎంట్రీ.. లగ్జరీ కార్ల కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..

షాజైన్ అనే ప్రయాణికుడు లాహోర్ నుంచి కరాచీ వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. కానీ జెడ్డాలో ల్యాండ్ అయ్యాడు. ‘‘డొమెస్టిక్ టెర్మినల్ గేల్ వద్ద రెండు విమానాలు ఉన్నాయి. నేను నా టికెట్ ఇచ్చాను, ఎవరూ నన్ను ఆపలేదు, విమానం బయలుదేరిన 2 గంటల్లోనే ఏదో తప్పు జరిగిందని అర్థమైంది’’ అని షాజైన్ మీడియాతో చెప్పారు. విమాన సిబ్బంది బోర్డింగ్ పాస్‌ను సరిగా చూసుకోవకపోవడం, అంతర్జాతీయ ప్రయాణ పత్రాలు లేకపోవడాన్ని గమనించలేదు.

జెడ్డాలో దిగిన తర్వాత, కరాచీలో ఎందుకు ల్యాండ్ అవ్వలేదు అని అడిగిన సందర్భంలో అసలు విషయం తెలిసినట్లు షాజైన్ చెప్పారు. దీంతో, సిబ్బంది తననే నిందించారని ఆయన వాపోయాడు. ప్రస్తుతం, ఇతను తిరిగి రావడానికి మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. షాజైన్ ఇప్పుడు విమానయాన సంస్థకు లీగల్ నోటీసు జారీ చేశాడు, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రయాణ ఖర్చులు, మానసిక క్షోభతో సహా ఈ కష్టానికి పరిహారం డిమాండ్ చేశాడు. చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా ఒక ప్రయాణీకుడు బోర్డింగ్ క్లియర్ చేసి విదేశాలకు ఎలా వెళ్లాడనే దానిపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) విచారణ నిర్వహించనుంది.

Exit mobile version