Site icon NTV Telugu

Facebook Post: సిల్లీ పోస్ట్ పెట్టాడు.. పోలీసులు అతని సరదా తీర్చారు

Pakistani Fake Post

Pakistani Fake Post

Pakistani Man Arrested Over Fake Social Media Post About UK Woman: ఈమధ్య క్రాస్-బార్డర్ లవ్ స్టోరీలు ఎక్కువగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తుల్ని పెళ్లాడటం కోసం ప్రేమికులు హద్దులు దాటేస్తున్నారు. సీమా-సచిన్, అంజు-నస్రుల్లా వ్యవహారాలైతే.. ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉన్నాయి. ఈ రెండు జంటలు బాగా ఫేమస్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. తనకూ పాపులారిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఓ వ్యక్తి సిల్లీ పోస్టు పెట్టాడు. ఈ పోస్టుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. చివరికి అది ఫేక్ అని తేలడంతో, అతని సరదా తీర్చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Telangana Cabinet: కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. వివిధ అంశాలపై చర్చ

ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వాకు చెందిన మహమ్మద్‌ గులాబ్‌ అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో క్రాస్-బార్డర్ ప్రేమపై సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన పాక్ యువకుడితో కలిసి జీవితాంతం ఉండేందుకు ‘ఇలా’ అనే ఒక ‍బ్రిటీష్‌ మహిళ సలార్‌జైకు వచ్చిందని ఆ పోస్టులో పేర్కొన్నాడు. అది వైరల్ అవ్వడంతో.. పోలీసుల దృష్టికి చేరింది. దీంతో.. పోలీసులు అప్రమత్తమై, ఆ వ్యక్తి ఆ పోస్టులో పేర్కొన్న చిరునామాకు వెళ్లి పరిశీలించారు. అతడు చెప్పినట్టు అక్కడ ఎవరూ లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో కోపాద్రిక్తులైన పోలీసులు.. ఈ ఫేక్‌ పోస్టు క్రియేట్‌ చేసిన ముహమ్మద్‌ గులాబ్‌పై కేసు నమోదు చేశారు. అతడు ఎక్కడున్నాడో ఆచూకీ కనుగొని, అరెస్ట్ చేశారు.

Gun Firing: అమెరికాలో మరోసారి పేలిక తుపాకీ.. ఇద్దరు మృతి

అయితే.. స్థానికులు మాత్రం మహమ్మద్‌ గులాబ్ అరెస్ట్‌ని వ్యతిరేకించారు. ఈమధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఇలాంటి పోస్టులు సర్వసాధారణం అయిపోయాయని, ఈమాత్రం దానికే అరెస్ట్ చేస్తారా? అని వాళ్లు వాదిస్తున్నారు. సరిహద్దులు దాటుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా.. పోస్టు పెట్టిన వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడుతున్నారు. కాగా.. అంజు-నస్రుల్లా వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో, అక్కడి అధికారులు అప్రమత్తగా ఉన్నారు. అందుకే, ఈ ఫేక్ పోస్టుని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

Exit mobile version