NTV Telugu Site icon

UK: బ్రిటీష్ బాలికలపై పాకిస్తానీయుల అత్యాచారం.. యూకేని కుదిపేస్తున్న ‘‘రోథర్‌హామ్ స్కాండల్’’

Rotherham Scandal

Rotherham Scandal

UK: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగులపై అక్కడి ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని ‘‘రేప్ గ్యాంగ్’’గా పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా యూకే వ్యాప్తంగా 1997-2013 మధ్య జరిగిన ‘‘రోథర్‌హామ్ స్కాండల్’’పై పెద్ద యుద్ధమే జరుగుతోంది. పాకిస్తాన్ రేప్ గ్యాంగ్ స్కాండల్స్‌పై జాతీయ విచారణను UK ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. యార్క్‌షైర్ పట్టణంలోని రోథర్‌హామ్‌లో మైనర్ బాలికలపై లైంగిక దాడులపై యూకే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోవడాన్ని ఎలాన్ మస్క్‌తో పాటు హారిపోటర్ సినిమా రచయిత జేకే రౌలింగ్ ప్రశ్నించారు. వీరితో పాటు యూకే మాజీ ప్రధాని లిజ్ ట్రస్ కూడా పిల్లల లైంగిక వేధింపుల కేసులపై జవాబుదారీతనాన్ని డిమాండ్ చేశారు.

సంవత్సరాల వ్యవధిలో రోథర్‌హామ్ ప్రాంతంలో బ్రిటీష్ బాలికలు తీవ్రమైన అత్యాచారాలకు, లైంగిక దోపిడికి గురయ్యారు. 1400 వరకు అమ్మాయిలు బాధితులుగా ఉన్నారని స్వతంత్ర విచారణలో వెల్లడైంది. బాలికల్ని లక్ష్యంగా చేసుకుని మాయమాటలు చెప్పి అక్రమంగా రవాణా చేసిన ఈ స్కాండల్‌లో ఎక్కువ మంది పాకిస్తానీ నేపథ్యం ఉన్నవారు. బాధితులు పదేపదే ముందుకు వచ్చినప్పటికీ, యూకే ప్రభుత్వం ఈ గ్యాంగులపై కఠిన చర్యలు తీసుకోలేదని ప్రధాన ఆరోపణ.

ఎలాన్ మస్క్ ఈ విషయంపై స్పందించారు. ప్రస్తుతం యూకే ప్రధానిగా కైర్ స్టార్మర్‌ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ‘‘రేప్ ముఠాలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న సమయంలో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (CPS) అధిపతి ఎవరు..?’’ అని ప్రశ్నించారు. 2008-2013 వరకు సీపీఎస్ అధిపతిగా ప్రస్తుత ప్రధాని కైర్ స్టార్మర్ ఉన్నారు. న్యాయం జరగకుండా యువతులను దోపిడీ చేయడాని అనుమతిస్తారా..? అని ఎలాన్ మస్క్ ప్రశ్నించారు.

READ ALSO: Mutton Paya Soup Recipe: మటన్ పాయా సూప్ తయారీ విధానం.. దీంతో ఎన్ని లాభాలంటే?

ఈ స్కాండల్‌పై ఎలాన్ మస్క్‌కి ప్రముఖ రచయిత జేకే రౌలింగ్ కూడా జతకలిశారు. గ్రూమింగ్ గ్యాంగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని రేప్ గ్యాంగులుగా పిలవాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసు అవినీతి జరిగిందా.? అంటూ ఆమె ప్రశ్నించారు. , “రేప్ గ్యాంగ్‌లు (వాటిని ‘గ్రూమింగ్’ గ్యాంగ్‌లు అని ఎందుకు పిలుస్తారు? వ్యక్తులను కత్తితో పొడిచి చంపేవారిని ‘కత్తి యజమానులు’ అని పిలవడం లాంటిది) రోథర్‌హామ్‌లోని బాలికలకు ఏమి చేశారనే దాని గురించి వెలువడుతున్న వివరాలు చాలా భయంకరమైనవి. పోలీసుల అవినీతి ఆరోపణ నమ్మకం ఏర్పడింది’’ అంటూ ఆమె పోస్ట్ చేశారు.

మాజీ ప్రధాని లిజ్ ట్రస్ కూడా ఈ స్కాండల్‌పై గళమెత్తారు. “11 ఏళ్లలోపు బాలికలపై జరిగిన ఈ భయంకరమైన అత్యాచార ఘటనలు మన దేశాన్ని తలదించుకున్నాయి. నేరస్తులను శిక్షించడమే కాదు. జాతి వైషమ్యాలను రెచ్చగొట్టకూడదనే పేరుతో కళ్లు మూసుకున్న అధికారులు కూడా అలాగే ఉంటారు.రేప్ ముఠాలపై భయంకరమైన వైఫల్యాలు బ్రిటీష్ క్రిమినల్ జస్టిస్‌లో పూర్తి జవాబుదారీతనం లేకపోవడాన్ని చూపిస్తోంది. ’’ అని ఆమె పోస్ట్ చేశారు.

గ్రూమింగ్ గ్యాంగ్ కుంభకోణం 1997-2013 మధ్య దక్షిణ యార్క్‌షైర్‌లోని రోథర్‌హామ్‌లో జరిగింది. వందలాది బాలికను పాకిస్తానీ మూలాలకు చెందిన వ్యక్తులు లైంగికంగా దోపిడీ చేశారు. సెప్టెంబర్ 13, 2024లో ఏడుగురు వ్యక్తులపై చైల్డ్ సెక్స్ నేరాల కింద అరెస్ట్ చేశారు. ఈ ఏడుగురు 2000లో ఇద్దరు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 11, 15 ఏళ్ల ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించారు. ఈ కేసులో మహ్మద్ అమర్ (42), మహ్మద్ సియాబ్ (44), యాసర్ అజైబే (39), మహ్మద్ జమీర్ సాదిక్ (49), అబిద్ సాదిక్ (43), తాహిర్ యాసిన్ (38), మరియు రమిన్ బారీ (37) నిందితులుగా ఉన్నారు. ఈ ఘటన యూకే చరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది.

Show comments