ఖైబర్ పఖ్తుంఖ్వా గ్రామంపై పాక్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపింది. 8 బాంబులు వేయడంతో 30 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) రహస్య స్థావరాలు లక్ష్యంగా పాక్ వైమానిక దళాలు దాడి చేయగా.. గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులెవరూ కూడా చనిపోలేదు. చనిపోయిన వారందరూ పౌరులే ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Supreme Court: దురదృష్టకరం.. ఎయిరిండియా ప్రమాద కథనాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
ఇటీవలి రోజుల్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పర్వత ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందింది. దీంతో పాక్ సైన్యం చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి 2 గంటలకు ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయగా సామాన్యులు ప్రాణాలు వదిలారు. స్థానిక మీడియా ప్రకారం చాలా మంది గాయపడ్డారని నివేదించింది. అయితే వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉన్నట్లు భావిస్తున్నారు. రెస్క్యూ బృందాలు వెలికితీస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లేకపోవడం దేవుడు నాకిచ్చిన అతిపెద్ద వరం
ఆదివారం డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో నిఘా ఆధారిత ఆపరేషన్‌లో ఏడుగురు టీటీపీ ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఏడుగురిలో ముగ్గురు ఆఫ్ఘన్ జాతీయులు, ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని సైన్యం మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 13-14 తేదీల్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో కనీసం 31 మంది టీటీపీ ఉగ్రవాదులు మరణించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. నేడు ఎంత పెరిగిందంటే..!
ఖైబర్ పఖ్తుంఖ్వాలో గత కొంతకాలంగా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనేక మంది పౌరులు మరణించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జూన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన డ్రోన్ దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజా దాడుల్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పౌరుల ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి పాకిస్థాన్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసుల ప్రకారం. ఈ ఏడాది జనవరి- ఆగస్టు మధ్య జరిగిన దాడుల్లో కనీసం 138 మంది పౌరులు, 79 మంది పాకిస్థానీ పోలీసు సిబ్బంది మరణించారు. ఆగస్టులో మాత్రమే 129 సంఘటనలు నమోదయ్యాయి. వీటిలో ఆరుగురు పాకిస్థాన్ ఆర్మీ, పారామిలిటరీ ఫెడరల్ కాన్స్టాబులరీ సిబ్బంది హత్యలకు గురయ్యారు.
