Masood Azhar: జైషే మహ్మద్ (JeM) చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను అరెస్టు చేయాలని ఆఫ్ఘనిస్తాన్‌కు పాకిస్తాన్ లేఖ రాసిందని పాకిస్థాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ మీడియా సంస్థ బోల్ న్యూస్ ప్రకారం, మౌలానా మసూద్ అజార్ బహుశా ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హర్, కన్హర్ ప్రాంతాల్లో ఉండవచ్చని సమాచారం. పారిస్‌కు చెందిన ఇంటర్నేషనల్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) కొంతమంది ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలని పాకిస్థాన్‌ను బలవంతం చేసిన తర్వాత ఈ నివేదిక వచ్చింది. ఇప్పుడు గ్రే లిస్ట్ నుంచి బయటపడే అవకాశం కోసం పాక్ ఈ లేఖ రాసినట్లు సమాచారం.
West Bengal: రణరంగాన్ని తలపించిన పశ్చిమ బెంగాల్.. పోలీసుపై దాడి వీడియో వైరల్
ముఖ్యంగా లష్కరే తోయిబా (LeT) ఆపరేషనల్ కమాండర్ సాజిద్ మీర్‌పై పాకిస్తాన్ ఇటీవలి చర్య తీసుకుంది. ఇది కూడా పాకిస్తాన్‌పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిరంతర ఒత్తిడి ఫలితంగా జరిగింది. అజార్ పాకిస్థాన్‌లో లేడని, అఫ్ఘనిస్థాన్‌లో ఉండే అవకాశం ఉందని పాకిస్థాన్ వాదిస్తోంది. అతను జాడలేడని పాకిస్తాన్ పేర్కొన్నప్పటికీ, అతను పాకిస్తాన్ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో జిహాద్‌లో మునిగిపోవాలని జైషే మహ్మద్ క్యాడర్‌లను ప్రోత్సహిస్తూ, కాబూల్‌ను తాలిబన్ స్వాధీనం చేసుకున్నందుకు ప్రశంసిస్తూ కథనాలను ప్రచురిస్తూనే ఉన్నాడు.
