Pakistan: సహాయంలో కూడా దాయాది దేశం పాకిస్తాన్ నీచంగా ప్రవర్తించింది. గడువు తీరిన సహాయ సామాగ్రిని అందించి, తన బుద్ధి ఏంటో మరోసారి నిరూపించుకుంది. దిత్వా తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిని శ్రీలంకు సాయం చేస్తున్నామని చెబుతూ పాకిస్తాన్ హైకమిషన్ సహాయ ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, వాటిపై ఎక్స్‌పైరీ డేట్ 10/2024గా ఉంది. దీంతో పాకిస్తాన్‌పై విమర్శలు వాన మొదలైంది. గడువు తీరిన ఆహారాన్ని అందించడంపై పాక్ వైఖరిని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
Read Also: CJI Surya Kant: ‘‘రోహింగ్యాలను రెడ్ కార్పెట్‌తో స్వాగతించాలా..?’’ సుప్రీం ఘాటు వ్యాఖ్యలు..
తుఫాన్ కారణంగా శ్రీలంకలోని చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వరదలతో అల్లాడుతోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ అందించిన సాయం అందరిని ఆగ్రహానికి గురిచేస్తోంది. ‘‘పాకిస్తాన్ ఎల్లప్పుడూ శ్రీలంకతో నిలుస్తుంది’’ అని పాక్ హైకమిషన్ సహాయ సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పాక్ అప్‌లోడ్ చేసిన ఫోటోల్లో వాటిపై 2024లోనే గడువు తీరినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఇస్లామాబాద్ నుంచి స్పష్టత లేదు. గతంలో కూడా పాకిస్తాన్ ఇలానే చేసింది. రెండేళ్ల క్రితం టర్కీ భూకంప బాధితులకు కోసం పంపిన సహాయ సామాగ్రి విషయంలో కూడా అభాసుపాలైంది. దీనికి ముందు టర్కీ, పాకిస్తాన్‌కు పంపిన సామాగ్రినే కొత్త లేబుల్స్ వేసి మళ్లీ టర్కీకే పంపించింది.
మరోవైపు, భారత్ శ్రీలంకకు ఆపన్నహస్తాన్ని అందించింది. భారత్ ద్వీపదేశంలో భారీ మానవతా కార్యక్రమాన్ని చేపట్టింది. ఆపరేషన్ సాగర్ బంధు కింద నవంబర్ 28 నుంచి భారత్ వాయు, సముద్ర మార్గాల ద్వారా 53 టన్నుల సహాయ సామాగ్రిని పంపించింది. శ్రీలంకలో చిక్కుకున్న 2000 మంది భారతీయుల్ని కూడా స్వదేశానికి తీసుకువచ్చింది. భారత్ సొంత దేశ ప్రజల్నే కాకుండా జర్మనీ, స్లోవేనియా, యూకే, దక్షిణాఫ్రికా, పోలాండ్, బెలారస్, ఇరాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరుల్ని కూడా రక్షించింది.
