Site icon NTV Telugu

Pakistan: చుక్కల్ని అంటుతున్న పెట్రోల్ ధరలు.. లీటర్ రూ. 290

Pakistan

Pakistan

Pakistan: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ మరోసారి పెట్రోల్ ధరల్ని పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలు నిత్యావసరాలు, గ్యాస్, కరెంట్ ధరలు పెరగడంతో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడి ప్రజలపై భారం మోపేందుకు షహబాజ్ సర్కార్ సిద్ధమైంది. వచ్చే రెండు వారాల్లో పాకిస్తాన్ పెట్రోల్ ధరల్ని పెంచనున్నట్లు అక్కడి స్థానిక మీడియా నివేదించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగదల కారణంగా పెట్రోల్ ధర లీటర్‌కి రూ. 10(పాకిస్తానీ రూపాయలు) మేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: USA: పాకిస్తాన్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నాం.. పాక్ పీఎంకు బైడెన్ లేఖ..

పాక్ చమురు పరిశ్రమ అంచనాల ప్రకారం.. పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 279.75 ఉండగా.. ఇది రూ. 289.69కి పెరిగే అవకాశం ఉంది. కిరోసిన్ ధర లీటర్‌కి రూ. 188.66 నుంచి రూ. 188.49కి స్వల్పంగా తగ్గుతుంది. లైట్ డీజిల్ ధర రూ. 0.45 పెరిగి రూ. 168.18 నుంచి రూ. 168.63కి పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరగడం వల్ల స్థానికంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. మార్చి మొదటి పక్షంలో బ్యారెల్ ధర 90 డాలర్లు ఉంటే ఇది ఇప్పుడు 95 డాలర్లకు పెరిగింది.

Exit mobile version