Pakistan: పాకిస్తాన్‌లో మనం ఎప్పుడూ ఊహించదని జరిగింది. విభజన తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభాతరం-గీతా పాఠాలు వినిపించాయి. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (LUMS) లో సంస్కృతాన్ని అధికారిక కోర్సుగా ప్రారంభించింది. మూడు నెలల పాటు జరిగిన సంస్కృత వర్క్‌షాప్‌కు వచ్చిన అసాధారణ స్పందన వచ్చినట్లు వర్సిటీ చెప్పింది. దీంతో ఇప్పుడు దీనిని యూనివర్సిటీ స్థాయి కోర్సుగా మార్చారు. 2027 నాటికి ఇది పూర్తిగా వన్ ఇయర్ కోర్సుగా మారనుంది. విద్యార్థులకు భగవద్గీ శ్లోకాలు, మహాభారత కథనాలను బోధించనున్నారు.
Read Also: Jaish Terrorist Arrested: ఉగ్ర కుట్ర భగ్నం.. సరిహద్దులో జైషే ఉగ్రవాది అరెస్ట్
సంస్కృత పునరుజ్జీవన ప్రయత్నాలకు కేంద్రంగా ఫోర్మాన్ క్రిస్టియన్ కళాశాలలో సోషియాలజీ బోధించే ప్రొఫెసర్ షాహిద్ రషీద్ ఉన్నారని ది ట్రిబ్యూన్‌లోని ఒక నివేదిక తెలిపింది. దక్షిణాసియా ప్రాంతంలో తత్వశాస్త్రం, సాహిత్యం, ఆధ్యాత్మిక సంప్రదాయాలనున రూపొందించిన భాష అధ్యయానాన్ని పునరుద్ధరించే దిశగా రషీద్ చర్యలు కీలకమని చెప్పారు. సంస్కృతం ఈ ప్రాంతం మొత్తాన్ని కలిపే భాష అని, పాణిని గ్రామం పాకిస్తాన్‌లోనే ఉందని, సింధూ లోయ నాగరికత కాలంలో చాలా రచనలు జరిగాయని రషీద్ చెప్పారు. ఇది ఏ ఒక్క మతానికి పరిమితం కాదని వెల్లడించారు. సంస్కృత వ్యాకరణవేత్త పాణిని ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఖైబర్ ఫఖ్తుంఖ్వాగా పిలిచే గాంధారలో నివసించారు.
మొదట్లో విద్యార్థులు సంస్కృతాన్ని కష్టంగా భావించారని, అయితే త్వరలోనే దీనికి అలవాటు పడ్డారని, ఉర్దూ భాష సంస్కృతం ద్వారా ఎంతగా ప్రభావితమైందో తెలుసుకుని విద్యార్ధులు ఆశ్చర్యపోయారని అన్నారు. 10-15 ఏళ్లలో పాకిస్తాన్ నుంచి గీత, మహాభారత పండితులు ఏర్పడటం చూడొచ్చని మరో ప్రొఫెసర్ అలీ ఉస్మాన్ ఖాస్మీ అన్నారు.
