Pakistan: భారత దేశానికి ఏ మాత్రం తీసుపోము, చెప్పాలంటే భారత్ కన్నా మేమే గొప్ప అని ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ తీరు నవ్వులపాలవుతూనే ఉంది. తాజాగా, పాకిస్తాన్ పరీక్షించిన ఒక క్షిపణి కూలిపోయింది. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన షాషీన్-3 మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. ఆ సమయంలోనే భారీ ప్రమాదం సంభవించింది. పాకిస్తాన్ క్షిపణి దారితప్పి, లక్ష్యాన్ని ఛేదించకుండానే బలూచిస్తాన్ ప్రావిన్సులో డేలా బుగ్టి లో పేలిపోయింది. అయితే, పరువు పోతుందని పాకిస్తాన్ మీడియా కానీ, సైనిక విభాగం కానీ ఈ ప్రమాదంపై ఎలాంటి కథనాలు, నివేదికలు ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియా, అనేక ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అకౌంట్లలో కూలిపోయిన చిత్రాలు వచ్చాయి. వార్తలు వ్యాప్తి చెందకుండా పాకిస్తాన్ ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ షట్ డౌన్ చేసింది.
Read Also: Navi Mumbai: వివాహితపై మోజుతో, ఆమె భర్త దారుణహత్య..
జూలై 22న జరిగిన ఈ ప్రమాదం, పాకిస్తాన్ అణ్వాయుధాలకు కేంద్రంగా ఉన్న, యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్ ఉన్న డేరా ఘాజీ ఖాన్ సమీపంలో జరిగింది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం..క్షిపణి గాలిలోనే పేలిపోయినట్లు తెలుస్తోంది. దీని శిథిలాలు జనాలు ఉండే ప్రాంతాల్లో పడ్డాయి. ఆ సమయంలో భారీ పేలుడు వినిపించిందని చెబుతున్నారు. ఈ పేలుడు శబ్ధం 50 కి.మీ దూరంలో ఉన్న వారికి కూడా వినిపించినట్లు తెలుస్తోంది. సైన్యం వెంటనే ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ బ్లాక్ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో ఆతర్వాత వైరల్ అయ్యాయి. గతంలో కూడా పలుమార్లు షాహీన్ క్షిపణి విఫలమైంది.
Pakistani Punjabi Army carried out a failed test of Shaheen-III ballistic missile in Republic of Balochistan on Tuesday, 22 July 2025. Locals reported that the missile was fired from Balochistan’s territory of Dera Ghazi Khan which landed dangerously close to civilian settlement pic.twitter.com/VF4o15pa77
— Baba Banaras™ (@RealBababanaras) July 23, 2025
