Site icon NTV Telugu

Pakistan: ట్రంప్ ‘‘అణు పరీక్ష’’ కామెంట్స్.. స్పందించిన పాకిస్తాన్..

Shehbaz Sharif

Shehbaz Sharif

Pakistan: పాకిస్తాన్ అణ్వాయుధాలను రహస్యంగా పరీక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. ‘‘ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశం కాదు’’ అని పాకిస్తాన్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. సీబీఎస్ న్యూస్‌‌తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం కాదు. అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశం కాదు’’ అని అన్నారు.

Read Also: XPeng Flying Car: కార్లకు రెక్కలు రాబోతున్నాయి.. టెస్లాను బీట్ చేసిన చైనా కంపెనీ!

రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు ప్రజలకు తెలియకుండా భూగర్భ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని, అమెరికా కూడా ఇదే విధంగా చేస్తుందని ట్రంప్ అదివారం అన్నారు. రష్యా, చైనాలు అణు పరీక్షలు చేస్తున్నాయి, కానీ వారు వీటి గురించి మాట్లాడరు అని ట్రంప్ ఆరోపించారు.

సైనిక, పౌర ప్రయోజనాల కోసం అన్ని అణు పరీక్షలను నిషేధించే ‘‘కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రిటీ (CTBT)పై అమెరికా 1996 నుండి సంతకం చేసింది. చివరిసారిగా అమెరికా 1992లో అణు పరీక్షను నిర్వహించింది. ఉత్తరకొరియా తప్పా మరే దేశం కూడా దశాబ్ధాలుగా న్యూక్లియర్ డిటోనేషన్ చేయలేదు. రష్యా, చైనాలు 1990, 1996 తర్వాత నుంచి అణు పరీక్షలు నిర్వహించలేదు. పాకిస్తాన్ చివరిసారిగా 1998లో అణు పరీక్ష నిర్వహించింది. పాకిస్తాన్ సీటీబీటీపై సంతకం చేయనప్పటికీ, అణుపరీక్షలపై ఏకపక్ష తాత్కాలిక నిషేధాన్ని పాటిస్తున్నట్లు చెబుతుంది.

Exit mobile version