NTV Telugu Site icon

Pakistan: 82 ఏళ్ల వయసులో కూడా నచ్చిన మహిళను పెళ్లి చేసుకో.. “లవ్ గురు”గా మారిన పాక్ ప్రధాని

Pakistanpm

Pakistanpm

Pakistan: పాకిస్తాన్ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ మరోసారి తన స్థాయి నుంచి దిగజారి మాట్లాడారు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రధాని స్థాయిని మరించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ వెళ్లి భారత్‌తో యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలికాడు. అయితే ఈ సారి ఏకంగా ‘లవ్ గురు’ అవతారం ఎత్తాడు. న్యూ ఇయర్ సందర్భంగా తన వీడియో సందేశంలో పాకిస్తాన్ ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

52 ఏళ్ల వ్యక్తి తనకు నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవాలా..? అని ప్రశ్నించారు. అయితే దీనికి ప్రధాని కాకర్ ‘‘మీకు 82 ఏళ్లు వచ్చినప్పటికీ, పెళ్లి చేసుకోవచ్చు’’ అంటూ బదులిచ్చాడు. ఒకరికి పిచ్చి అత్తగారు ఉంటే ఏం చేయాలని అడిగితే.. ప్రధాని స్పందిస్తూ, బహూశా ‘‘క్రైసిస్ మేనేజ్మెంట్ కోర్సు’’కి వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు.

Read Also: Adani-Hindenburg case: అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో రేపు సుప్రీంకోర్టు తీర్పు..

ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే, అతని వద్ద డబ్బు లేకుంటే ఏం చేయాలనే మరో ప్రశ్నకు.. తన జీవితంలో ఎవరిని కూడా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించలేదని, అయినప్పటికీ తాను ఎంతో మందిని ఇంప్రెస్ చేశానని ప్రధాని అన్వరుల్ కాకర్ అన్నారు. విదేశాల్లో ఉద్యోగం వచ్చి..తన ప్రేమను వదిలేయాల్సి వస్తే ఏం చేయాలని ప్రశ్నిస్తే.. ‘‘మీకు అవకాశం ద్వారా ప్రేమ లభిస్తుందని, మీ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగం పొందొచ్చని నేను అనుకుంటున్నాను, అవకాశాన్ని వదులుకోవద్దు’’ అంటూ ప్రధాని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి వరకు తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్‌ని ఎంపిక చేశారు.