Pakistan Economic Crisis: కరెంట్ కష్టాలు.. ఇంటర్నెట్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దేశంలోని విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో పాటు విపరీతమైన అప్పుల కారణంగా పాకిస్తాన్, మరో శ్రీలంకగా మారబోతోంది. శ్రీలంక పరిస్థితి రావడం ఖాయం కానీ.. ఎన్ని రోజుల్లో అనేదే తేలాలి. పాకిస్తాన్ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఐఎంఎఫ్ సాయం కోరుతోంది.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ కోతలు నెలకొన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం పాక్ ఎక్కువగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జి)పై ఆధారపడింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ఎల్ఎన్జిని కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంధన వనరులను ఆదా చేసేందుకు పాకిస్తాన్ విపరీతమైన కోతలు విధిస్తోంది. ఇప్పటికే కరెంట్ ను ఆదా చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు పనిగంటలను తగ్గించింది, కరాచీతో పాటు ఇతర నగరాల్లో షాపింగ్ మాల్స్, కర్మాగారాలు త్వరగా మూసివేయాలని ఆదేశించింది. మార్కెట్లు సాయంత్రం వరకే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
Also Read
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
తీవ్రమైన కరెంట్ సంక్షోభాన్ని ఎదురుకొంటున్న పాకిస్తాన్ కు అక్కడి టెలికాం ఆపరేటర్లు వార్నింగ్ ఇచ్చారు. ఎక్కువ గంటలు విద్యుత్ అంతరాయం కారణంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని.. అంతరాయం కారణంగా మొబైల్ నెట్వర్క్ కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ (ఎన్ఐబీటీ) ట్విట్టర్ లో పేర్కొంది.
ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఖతార్ తో పాక్ చర్చలు జరుపుతోంది. ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్, ఖతార్ ఇంధన వ్యవహారాల సహాయ మంత్రి, ఖతార్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాద్ అల్-కాబీతో దోహాలో భేటీ అయ్యారు. పాకిస్తాన్ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు వేగంగా క్షీణించాయి. ద్రవ్యోల్భనం పెరిగింది. జూలైలో పాకిస్తాన్ లో రెండంకెల ద్రవ్యోల్భనం నమోదు అయింది.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!