Site icon NTV Telugu

డబ్బులకోసం ప్రధాని ఇల్లు అద్దెకు…

పాకిస్తాన్ ఆర్ధిక వ్య‌వ‌స్థ ఎంత దిగ‌జారిపోయిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  పక్క‌నున్న గ‌ల్ఫ్ దేశాలు ఆయిల్, ప‌ర్యాట‌క రంగం పేరుతో సంపాద‌న పెంచుకుంటుంటే, పాక్ మాత్రం ఉగ్ర‌వాదుల‌కు అండగా ఉంటూ, చైనాకు వ‌త్తాసు ప‌లుకుతూ, ఇండియాని చూసి ఏడుస్తూ పరిస్థితిని దిగజార్చుకుంటోంది.  ఇప్ప‌టికే ఆ దేశం పీక‌ల‌లోతు అప్పుల్లో కూరుకుపోయింది.  చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే లాభం ఏముంటుంది.  ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ స‌ర్కార్ ప‌రిస్థితి కూడా అలానే ఉన్న‌ది.  

Read: వైర‌ల్‌: పెళ్లికొడుకు చేతిలో చిల్ల‌ర‌…కాళ్ల‌కు దండాలు…

ఇస్లామాబాద్‌లో ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు అధికారిక నివాసం ఉన్న‌ది.  విశాల‌మైన స్థ‌లంలో ఉన్న అధునాత‌న భ‌వ‌నం అది.  అయితే, ఇటీవ‌లే ఆయ‌న దాన్ని ఖాళీచేశారు.  మొద‌ట ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాలయం ఏర్పాటు చేద్దామ‌ని అనుకున్నా కుద‌ర‌లేదు.  దీంతో ఈ భ‌వ‌నాన్ని అద్దెకు ఇవ్వాల‌ని ఇమ్రాన్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అంత‌ర్జాతీయ ఈవెంట్లు, సెమినార్ల‌కు ఈ భ‌వ‌నాన్ని అద్దెకు ఇవ్వ‌బోతున్నారు.  ఫ‌లితంగా కోట్ల రూపాయలు సంపాద‌న వ‌స్తుంద‌ని అది ప్ర‌భుత్వ నిర్వాహ‌ణ‌కు కొంత ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  

Exit mobile version