Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌కి భయాందోళనలు పెరిగాయి. కాశ్మీర్ అందాలను చూస్తున్న అమాయకపు ప్రజలపై పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై, టెర్రరిజంపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Nani : ‘హిట్3’ వైబ్ అదిరిపోయింది.. మీ సపోర్ట్ వలనే ఇది సాధ్యమైంది
ఇదిలా ఉంటే, ఇప్పటికే సింధు జలాల ఒప్పందం భారత్ రద్దు చేయడంతో పాకిస్తాన్ హడలి చేస్తోంది. మరోవైపు, భారత్ సైనిక చర్యకు దిగుతుందనే సమాచారంతో దాయాది దేశం భయపడుతోంది. ఈ నేపథ్యంలో పీఓకే, గిల్గిత్ ప్రాంతాలకు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ నుంచి వెళ్లే విమానాలను రద్దు చేసుకుంది. మరోవైపు, భద్రతా కారణాలను చెబుతూ.. పాకిస్తాన్ విమానయాన అధికారులు మే 1 నుంచి మే 31, 2025 వరకు కరాచీ, లాహోర్ ఎయిర్ స్పేస్‌లను పాక్షికంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (PAA) జారీ చేసిన ఎయిర్‌మెన్‌లకు నోటీసు (NOTAM) జారీ చేసింది. ఈ నెల పొడవునా ప్రతీ రోజు ఉదయం 4 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ రెండు నగరాల గగనతలాన్ని పాక్షికంగా మూసివేయబడుతాయి.
