పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో జరిగిన మత ఘర్షణల్లో 100 మంది చనిపోయారని ఆసుపత్రి సిబ్బంది గురువారం మీడియాకు తెలిపింది. పరాచినార్ ప్రాంతంలో షియా ముస్లింలను తీసుకువెళుతున్న ప్యాసింజర్ కోచ్‌ల కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో హింస చెలరేగింది. దీంతో భారీ ప్రాణనష్టం సంభవించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
ఇది కూడా చదవండి: Telangana: త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్.. ఎన్నికలెప్పుడంటే..?
గత వారం నుంచి షియా – సున్నీ వర్గాల మధ్య మొదలైన ఘర్షణ తారాస్థాయికి చేరింది. వాహనాలపై జరిగిన దాడి తర్వాత అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారు. అయితే కాల్పుల విరమణ సమయంలో చెదురు మదురు ఘర్షణలు చోటు చేసుకోవడంతో మృతుల సంఖ్య 100కి పైగా దాటిందని కుర్రం జిల్లా డిప్యూటీ కమిషనర్ జావేదుల్లా మెహసూద్ మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: US: బోర్డింగ్ పాస్ లేకుండానే న్యూయార్క్ నుంచి పారిస్‌కు జర్నీ.. చివరికిలా..!