Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..

  • 2027 ఐఎంఎఫ్-వరల్డ్ బ్యాంక్ బోర్డ్ గవర్నర్స్ అధ్యక్ష బాధ్యతలు పాకిస్తాన్ చేతుల్లోకి..
  • 1953 తర్వాత తొలిసారిగా పాక్‌కు అవకాశం..
  • అప్పులు తీసుకునే పాకిస్తాన్, అప్పులిచ్చే ఐఎంఎఫ్‌లో కీలక పదవి పొందుతోంది..
Pakistan Imf

Pakistan Imf

Pakistan: విదేశీ రుణాలు, సౌదీ డబ్బులు, అమెరికా డాలర్లపై ఆధారపడే పాకిస్తాన్, ఇప్పుడు అప్పులు ఇచ్చే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టబోతోంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ (WBG) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు 2027 ఏడాదికి గానూ అధ్యక్ష పదవికి నామినేట్ చేయబడిందని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. 1953 తర్వాత ఈ పదవిని పాకిస్తాన్ తిరిగి చేపట్టడం ఇదే తొలిసారి.

బ్యాంకాక్‌లో జరిగిన ఐఎంఎఫ్-ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల 2026 ప్లీనరీ సెషన్‌లో పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి అహద్ ఖాన్ చీమా తదుపరి అధ్యక్ష పదవి కోసం ప్రకటించారు. చీమా ప్రపంచ వ్యాక్‌లో పాకిస్తాన్ గవర్నర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఈ పరిణామాన్ని పాకిస్తాన్ గొప్ప విజయంగా అభివర్ణించుకుంటోంది. పాకిస్తాన్ తన ఆర్థిక కష్టాలను తీర్చుకునేందుకు ఎక్కువగా ఐఎంఎఫ్ రుణాలపై ఆధారపడుతోంది. ఇప్పుడు దానికి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటోంది.

పాకిస్తాన్ తన ఆర్థిక అవసరాల కోసం ఐఎంఎఫ్ సాయంపై ఆధారపడుతోంది. ప్రస్తుతం పాకస్తాన్ 7 బిలియన్ డాలర్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) ప్రోగ్రామ్ కింద అప్పు తీసుకుంటోంది. విదేశీ చెల్లింపులు, ఇతర అవసరాల కోసం ఈ డబ్బును వినియోగిస్తోంది. ఇదే కాకుండా వాతావరణ మార్పలు వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు 1.4 బిలియన్ డాలర్ల రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ(RSF) కింద కూడా పాకిస్థాన్ ఆర్థిక సాయం పొందుతోంది.