Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్ పరువు మళ్లీ పోయింది.. 110 దేశాలను ఆహ్వానిస్తే 7 స్పందించాయి..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ దివాళా అంచుకు చేరుకుంటోంది. కానీ ఆ దేశ సైన్యం మాత్రం ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంది. మాట మాట్లాడితే తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని భయపెడుతుంది తప్పితే.. అక్కడి ప్రజల ఆకలిని మాత్రం తీర్చలేకపోతోంది. ఉగ్రవాద దేశంగా ముద్ర పడిన పాకిస్తాన్, నానాటికి ప్రపంచంలో ఒంటరిగా మారుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తన ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా కూడా ప్రస్తుతం ముహం చాటేస్తోంది. ఇన్నాళ్లు పాకిస్తాన్ కు డాలర్లు ఇస్తూ ఆదుకుంటూ వచ్చిన సౌదీ అరేబియా, యూఏఈ కూడా పట్టించుకోవడం లేదు.

Read Also: SSLV-D2 Launch Successfully: ఇస్రో సరికొత్త అధ్యాయం.. ఎస్ఎస్ఎల్‌వీ -డీ2 ప్రయోగం విజయవంతం..

ఇదిలా ఉంటే పాకిస్తాన్ నేవీ ‘‘ ఎక్సర్‌సైజ్ అమన్ ’’పేరుతో నాలుగు రోజుల పాటు ఓ మిలిటరీ కసరత్తును ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభించనుంది. పాకిస్తాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి 110 దేశాలను ఆహ్వానించింది. అయితే కేవలం 7 దేశాలు మాత్రమే పాక్ ఆహ్వానానికి స్పందించాయి. దీంతో పాకిస్తాన్ పరువు మరోసారి పోయినట్లు అయింది. అమెరికా, చైనా, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, ఇటలీ, జపాన్ దేశాలు మాత్రమే తమ నౌకలను పంపిస్తున్నాయి.

అయితే పాకిస్తాన్ మరో మిత్రుడు టర్కీ కూడా ఓడలు, ఒక విమానాన్ని పంపిస్తుందని భావించినప్పటికీ, భూకంపం కారణంగా రద్దు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా చితికిపోతున్నా కూడా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. చివరకు సాయం చేస్తుందని అనుకున్న ఐఎంఎఫ్ కూడా నో చెప్పేసింది. ఐఎంఎఫ్ షరతులకు పాకిస్తాన్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదరలేదనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే పాకిస్తాన్ దివాళా తీయడం ఖాయం.

Exit mobile version