Pakistan: పాకిస్తాన్ అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకోవడం అలవాటుగా మారింది. ఇస్లామిక్ ప్రపంచానికి పెద్దన్నగా కలరింగ్ ఇస్తున్న పాకిస్తాన్‌కు జపాన్ భారీ షాక్ ఇచ్చింది. జపాన్‌లోని కవాగోలో మసీదు వివాదంలో ఆ దేశ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మసీదు భవనాన్ని అవసరమైన అనుమతులు లేకుండా నిర్మించినట్లు జపాన్ అధికారులు చెప్పారు. ఈ మసీదును సైతామా ప్రిఫెక్చర్‌లోని కవాగోలో లో నిర్మించారు. పర్వత అటవీ భూమిగా గుర్తించిన భూమిలో ఈ మసీదు ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో అధికారులు ప్రత్యేక అనుమతి మంజూరు చేస్తే తప్ప సాధారణ నిర్మాణాలు చేయడం నిషేధం.
ఈ భూమి మార్చి 2025లో ఫుజిమికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నుండి కవాగోలో ఉన్న ఒక సంస్థ చేతుల్లోకి మారింది. ఈ ఏడాది ప్రారంభంలో మసీదు ప్రారంభోత్సవారికి పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ హమీద్ హాజరయ్యారు. అయితే, ఇప్పుడు ఈ మసీదుకు తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ చెబుతోంది. జపాన్‌లో నివసిస్తున్న పాకిస్థానీయులు స్థానిక చట్టాలను పూర్తిగా పాటించాలని సూచించింది. ప్రార్థనా స్థలాలు సహా ఏ నిర్మాణ ప్రాజెక్ట్ అయినా స్థానిక ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతే ప్రారంభించాలని స్పష్టం చేసింది.
మసీదు ప్రారంభోత్సవ సమయంలో అన్ని అనుమతులు తీసుకున్నట్లు తమకు చెప్పినట్లు పాక్ రాయబార కార్యాలయం తెలిపింది. స్థానిక చట్టాలను ఉల్లంఘించే ప్రాజెక్టులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్ చెప్పింది. ఇదిలా ఉంటే మసీదు ప్రతినిధి షేక్ మహ్మద్ ఈ ఘటనపై విమర్శలు చేశారు. అనుమతులు తీసుకోకుండా మసీదు నిర్మించడం మంచి విషయం కాదని అన్నారు. స్థానిక ప్రజలతో సఖ్యతగా ఉండటం ద్వారా మాత్రమే మసీదుకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు.
