Pakistan: సింహంతో టిక్‌టాక్.. తుంటరి యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం
- సింహంతో టిక్‌టాక్
- తుంటరి యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం
- పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. వీడియోలు పోస్టు చేసేందుకు యువత అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. ఫేమస్ కోసమో.. లేదంటే లైక్‌లు కోసమో తెలియదు గానీ.. హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకునే స్టంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు పోయాయి. అయినా కూడా చాలా మందికి బుద్ధి రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. సహజంగా సింహాన్ని చూస్తేనే.. వణుకుపుడుతుంది. అలాంటిది దాని దగ్గరకు వెళ్లి టిక్‌టాక్ చేసేందుకు ప్రయత్నించి దాని నోటికి చిక్కాడు. అంతే సింహం దాడిలో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చేరాడు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: రంగం ఏదైనా భారతీయులదే విజయం.. దావోస్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Also Read
పంజాబ్ ప్రావిన్సుకు చెందిన ముహమ్మద్ అజీమ్ అనే యువకుడు.. లాహోర్ సమీపంలోని జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్లాడు. బోనులో ఉన్న సింహంతో టిక్‌టాక్ చేసేందుకు లోపలికి వెళ్లాడు. అంతే వెంటనే సింహం దాడికి దిగింది. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి అతడిని రక్షించారు. తీవ్రగాయాలు కావడంతో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధింత యాజమాన్యంపై మండిపడ్డారు. అంతేకాకుండా ఫామ్ యజమాని బ్రీడింగ్ లైసెన్సును రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Venu Swami: నాగచైతన్య, శోభితల జోస్యం.. వేణు స్వామి బహిరంగ క్షమాపణలు
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!