Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు
- వాహనదారులకు భారీ షాక్
- పెట్రోల్‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు
- యుద్ధం ప్రారంభం తర్వాత రెండోసారి ఝలక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ అంతు చూస్తామంటూ ట్రంప్ ప్రకటన తర్వాత ప్రపంచ దేశాలు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఇక ట్రంప్ ప్రకటన తర్వాత చమురు ధరలు మరింత ఆకాశన్నంటుతున్నాయి. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో ధరలు భారీగా పెరగగా.. తాజాగా పాకిస్థాన్ కూడా ఇంధన ధరలు పెంచేసింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Iran-US War: ఇరాన్‌పై అమెరికా దాడులు.. కూలిన అతి పెద్ద వంతెన.. 8 మంది మృతి
Also Read
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
- BRICS 2026: "ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం".. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
- Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్‌లైన్‌కు నష్టం!
లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.137 పెంచగా.. డీజిల్‌పై రూ. 184 పెరిగింది. ఇక కిరోసిన్ ధరను లీటర్‌కు రూ.34.08 పెంచింది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.458.4కు చేరింది. ఇక డీజిల్ ధర రూ.520.35కు పెరగగా.. లీటర్ కిరోసిన్ ధర రూ.457.80కు చేరింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న దగ్గర నుంచి పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్రంగా పెరిగింది. దీంతో నిరంతరం ధరలను పెంచుతూనే ఉంది. కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం శాఖ మంత్రి మాలిక్ చెప్పినట్లు డాన్ పత్రిక నివేదించింది.
ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం తొలుత మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 పెంచింది. ఇప్పుడు ఆ పెంపును మరోసారి పెంచేసింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. తాజాగా మరోసారి ఇంధన ధరలు పెరిగిపోవడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.
తాజావార్తలు
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?