Site icon NTV Telugu

Pakistan: ఆపరేషన్ సిందూర్‌పై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Ishaqdar

Ishaqdar

ఆపరేషన్ సిందూర్‌పై దాయాది దేశాధినేతలు ఒక్కొక్కరు నోరు విప్పితున్నారు. తాజాగా పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లోని కీలకమైన వైమానిక స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసిందని ఇషాక్ దార్ అంగీకరించారు. రావల్సిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, షోరో‌కోట్ ఎయిర్‌బేస్ రెండు ధ్వంసం అయినట్లుగా ఉప ప్రధాని ఒప్పుకున్నారు. భారత్ జరిపిన దాడులతో భారీ నష్టం జరిగినట్లుగా ఒప్పుకున్నారు.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: ప్రాథమిక కారణాన్ని గుర్తించిన దర్యాప్తు సంస్థలు! ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..!

పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు భారీ నష్టం జరిగినట్లు ఒప్పుకున్నారు. భారత్ మెరుపు దాడులు చేసిందని.. దీంతో రెండు ఎయిర్‌బేస్‌లు పూర్తిగా ధ్వంసమైనట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాగానే.. సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ వ్యక్తిగతంగా తనతో మాట్లాడారని.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడాలని యువరాజు సూచించినట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య సమస్యలను తగ్గించేందుకు రియాద్‌ ముఖ్యమైన పాత్ర పోషించిందని.. అలాగే అమెరికా సైతం భారత్‌ను నిలువరించే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు. ఇక భారత్ దాడులను పాక్ ప్రధాని షరీఫ్ కూడా అంగీకరించారు.

ఇది కూడా చదవండి: Exclusive : తమిళ హీరోలకు తెలుగు దర్శకులు అలా.. తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఇలా

ఏప్రిల్ 22న పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్ పట్ల కఠిన వైఖరి తీసుకుంది. అనంతరం మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో కాల్పుల విరమణ జరిగింది.

 

Exit mobile version