Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్‌లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Cuts Petrol and Diesel Prices: పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలకు మరోసారి ఇంధన ధరల విషయంలో ఊరటనిచ్చింది. పెట్రోల్ మరియు హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరలను తగ్గిస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. తాజా ప్రకటన ప్రకారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.6, డీజిల్ ధరను రూ.6.80 మేర తగ్గించారు. ఈ కొత్త ధరలు మే 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. కొత్త ధరల ప్రకారం పాకిస్తాన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.403.78గా ఉండగా, హెచ్ఎస్డీ ధర రూ.402.78గా నిర్ణయించారు. ఇంధన ధరలను వరుసగా రెండో వారం కూడా తగ్గించడం గమనార్హం. గత వారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 చొప్పున తగ్గించారు.
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ, పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజలకు కొంత ఊరట కలిగించింది. ముఖ్యంగా పెట్రోల్‌ను ఎక్కువగా ప్రైవేట్ వాహనాలు, రిక్షాలు, ద్విచక్ర వాహనాల్లో ఉపయోగిస్తుండటంతో మధ్యతరగతి ప్రజలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే హై-స్పీడ్ డీజిల్‌ను భారీ రవాణా వాహనాలు, పరిశ్రమలు మరియు పెద్ద జనరేటర్లలో వినియోగిస్తారు. అందువల్ల డీజిల్ ధర తగ్గడం రవాణా ఖర్చులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
అయితే ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ, గత కొన్ని నెలలుగా పాకిస్తాన్లో ఇంధన ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత మార్చి 6న పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 మేర పెంచింది. అనంతరం ఏప్రిల్ 2న కూడా పెట్రోల్‌పై 43 శాతం, డీజిల్‌పై 55 శాతం పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరిలో మధ్యప్రాచ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతి శుక్రవారం ఇంధన ధరలను సమీక్షిస్తోంది. ఈ కాలంలో ధరలు పలుమార్లు పెరగడం, తగ్గడం చోటుచేసుకుంది.
ఇక భారత్‌లో కూడా ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ముడి చమురు ధరల ప్రభావంతో మూడు దఫాల్లో కలిపి సుమారు రూ.5 మేర ధరలు పెరిగాయి. శనివారం మరోసారి పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరగగా, సీఎన్జీ ధర కూడా రూ.1 మేర పెరిగిన విషయం విదితమే.. అంటే, భారత్‌లో పెట్రో ధరలు పెరుగుతుండగా.. ఇప్పటికే భారీగా పెంచిన పాకిస్తాన్.. ఇప్పుడు క్రమంగా తగ్గించే ప్రయత్నాల్లో ఉంది..
తాజావార్తలు
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?