Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- ముష్షాక్ శిక్షణ విమానం ప్రమాదం
- పైలట్లు హుస్నైన్, అబ్దుల్ సమద్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా సమీపంలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 12, సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగినట్లు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలిపింది.
వివరాల ప్రకారం, క్వెట్టా జిల్లాలోని నవాన్ కిల్లీ ప్రాంతం సమీపంలో పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ముష్షాక్ (Mushshak) శిక్షణ విమానం కూలిపోయింది. మధ్యాహ్నం సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనలో ఇన్స్ట్రక్టర్ పైలట్ మేజర్ హుస్నైన్ షెహజాద్ హుమాయూన్, శిక్షణ పొందుతున్న పైలట్ కెప్టెన్ అబ్దుల్ సమద్ మరణించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.
Also Read
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
పైలట్ల మృతిపై అధ్యక్షుడు, ప్రధాని సంతాపం
ఇద్దరు సైనిక పైలట్లు మరణించడంపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అధ్యక్షుడు జర్దారీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ధైర్యం కలగాలని ప్రార్థించారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా పైలట్ల మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
గతంలోనూ పాకిస్థాన్‌లో విమాన ప్రమాదాలు
పాకిస్థాన్‌లో గతంలోనూ సైనిక విమానాలు, హెలికాప్టర్లు ప్రమాదాలకు గురయ్యాయి. గత జూన్‌లో ముజఫరాబాద్ సమీపంలో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ఎంఐ-17 (Mi-17) హెలికాప్టర్ కూలిపోయింది. ఆ ప్రమాదంలో విమానంలో ఉన్న సిబ్బంది మొత్తం మరణించారు. అదే నెలలో మార్దాన్ ప్రాంతంలో సాధారణ శిక్షణ ప్రయాణం సందర్భంగా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోవడంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు డాన్ వార్తా సంస్థ తెలిపింది.
తాజావార్తలు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!