Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి

  • పాకిస్థాన్‌లో ఘోర విషాదం
  • పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్
  • 21 మంది సైనికులు మృతి
Pakistan

Pakistan

దాయాది దేశం పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది. హెలికాప్టర్‌లో ఉన్న సిబ్బంది అందరూ అమరులయ్యారని పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR)ను ఉటంకిస్తూ పాకిస్థాన్ డాన్ పత్రిక వెల్లడించింది. హెలికాప్టర్‌లో 21 మంది సైనికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందరూ చనిపోయినట్లుగా సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్‌లో ఉన్న సైనిక సిబ్బంది దేశ సేవలో అమరులయ్యారని పాకిస్థాన్ సైన్యం పేర్కొంది. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పాకిస్థాన్ ఆర్మీ దర్యాప్తు ప్రారంభించింది. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ.. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ముజఫరాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పాకిస్థాన్ సైనిక వర్గాల్లో విషాదాన్ని నింపింది.

×
×
Ad

ఎంఐ-17 హెలికాప్టర్ ప్రత్యేక ఇదే


MI-17 అనేది MI-8 నుంచి నవీకరించబడింది. కొత్త వెర్షన్ మిల్ మాస్కో హెలికాప్టర్ ప్లాంట్ ద్వారా నిర్మించారు. రష్యాలో తయారైన అత్యధిక బరువు మోసే రవాణా హెలికాప్టర్ ఇది. ఈ హెలికాప్టర్‌లో 30 మంది సైనికులు, 12 స్ట్రెచర్‌లు, సుమారు 4 వేల సరుకు మోయగలదు. మూడు టన్నుల వరకు బరువు మోయగలదు. రెండు క్లిమోవ్ TV3-117 ఇంజిన్‌ల ద్వారా శక్తి పొందుతుంది. గంటలకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.