Escape mid air collision: విమాన ప్రయాణాల్లో ప్రతీది పక్కాగా కాలిక్యులేట్ చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా జరిగే ప్రమాదాలు భారీగా ఉంటాయి. హ్యుమన్ ఎర్రర్, సాంకేతిక లోపాలు తెలత్తితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చేసిన చిన్న తప్పిదం పెద్ద ప్రమాదానికి కారణం అయ్యేదే. ఆకాశంలోనే రెండు విమానాలు ఢీకొట్టే ప్రమాదం ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే.. రెండు పాకిస్తాన్ విమానాలు ఒకదానికొకటి దగ్గర వచ్చాయి. అయితే పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని..ఎయిర్ లైన్ అధికారి మంగళవారం తెలిపారు. పాకిస్తాన్ పెషావర్ వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ( పీఐఏ) ఫ్లైట్ పీకే268 ఇరాన్ ఎయిర్ స్పేస్ లో ఉంది. ఆ సమయంలో 36000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం 20 వేల అడుగుల ఎత్తుకు దిగేందుకు ఏటీసీ అనుమతి కోరింది. అందుకు ఏటీసీ కూడా అనుమతించింది. అదే సమయంలో పీఐఏకు చెందిన మరో విమానం పాకిస్తాన్ నుంచి దుబాయ్ వెళ్తోంది. ఈ సమయంలో ఈ రెండు విమానాలు ఆకాశంలో ఎదురెదురుగా వచ్చాయి. దుబాయ్ వెళ్లే విమానం, పెషావర్ విమానం కన్నా కేవలం 1000 అడుగుల దూరంలో 35,000 అడుగల ఎత్తులో ఎగురుతోంది.
Read Also: Jubileehills minor girl case:జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక కేసు.. ఆ నలుగురికి బెయిల్
అయితే ఇది గమనించిన రెండు విమానాల పైలెట్లు విమానాల కోర్స్ ను సరిచేసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. అయితే ఈ విషయంపై ఇరాన్ అధికారులకు లేఖ రాస్తామని పీఐఏ ప్రతినిధులు చెప్పారు. అయితే పీఐఏ విమానాలు సాంకేతికంగా సరిగా లేకపోవడం, పైలెట్లు అజాగ్రత వ్యవహరించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం కరాచీ జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 99 మంది మరణించగా.. ఇద్దరు మాత్రమే ప్రాణాలతలో మిగిలారు.