Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్ లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది హత్య..

Pakistan

Pakistan

Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని మలాకాండ్ జిల్లాలో జరిగింది. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

Read Also: Tharun Bhaskar: ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తరుణ్ భాస్కర్…

నివేదిక ప్రకారం.. సాయుధులైన దుండగులు గత రాత్రి ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. కుటుంబానికి చెందిన సొంత అల్లుడు నిందితుల్లో ఒకరని తెలుస్తోంది. మరణించిన తొమ్మిది మందిలో అతని భార్య కూడా ఉంది.

Read Also: Mumbai: ముంబై నగరానికి నీటి కొరత.. ఒకటో తేదీ నుంచి నీటి కోతలు..

ఈ ఘటనకు వివాహానికి సంబంధించిన వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతకుముందు ఘటన గురించి తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారుే. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యాకాండకు వ్యతిరేకంగా మలకాండ్ వాసులు బాధితుల మృతదేహాలతో రోడ్డుపై నిరసన తెలిపారు.

Exit mobile version