NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం..

Pakistan

Pakistan

Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రీకులతో వెళ్తున్న ట్రక్కు కాలువలో పడిపోయింది. బుధవారం జరిగిన ఈ విషాదకరం సంఘటనలో మొత్తం 17 మంది మరణించారు. పాక్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. మరో 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని గురువారం పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్‌లోని ఖుజ్దార్ జిల్లాలోని ప్రసిద్ధి ముస్లిం సూఫీ పుణ్యక్షేత్రం షా నూరానీకి ప్రార్థనల కోసం వెళ్తున్న యాత్రీకులుకు చెందిన వాహనం ప్రమాదానికి గురూంది.

Read Also: Research: పరిశోధనా కేంద్రంగా భారత్.. ప్రపంచంలో 4వ స్థానం..

ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ కరీం బక్ష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూల మలుపు వద్ద ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. యాత్రీకులు ట్రక్కు తట్టా నుంచి షా నూరానీకి బయలుదేరింది. హబ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రక్కులో మొత్తం 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మరణించిన 17 మందిలో 15 మందిని గుర్తించారు.