NTV Telugu Site icon

Sharif-Trump: ఎట్టకేలకు స్పందించిన పాక్.. ట్రంప్‌కి ప్రధాని షరీఫ్ శుభాకాంక్షలు

Shariftrump

Shariftrump

అమెరికా అధ్యక్ష ఎన్ని్కలపై ఎట్టకేలకు పాకిస్తాన్ స్పందించింది. నవంబర్ 6న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ భారీ విజయంతో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 270 అయితే.. దాన్ని క్రాస్ చేసి 292 ఎలక్టోరల్‌ ఓట్లతో డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ట్రంప్‌నకు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కానీ పాకిస్తాన్ మాత్రం స్పందించలేదు. ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Jr NTR : తమిళ్ హిట్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా!!

‘‘రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందనలు! పాకిస్తాన్-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, విస్తృతం చేయడానికి రాబోయే పరిపాలనతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’’ అని షరీఫ్ పోస్ట్ చేశారు. ఈ పోస్టు నవంబర్ 6నే పోస్టు చేశారు అయితే పాకిస్తాన్‌లో సోషల్ మీడియాపై నిషేధం ఉండడంతో ఆలస్యంగా పోస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే ఎక్స్ ట్విట్టర్‌పై నిషేధం ఉంటే ప్రధాని ఎలా ఉపయోగిస్తారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 70 లక్షల రాబడి!.. అది కూడా కేవలం 14 నెలల్లోనే..

ట్రంప్‌ జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, కాన్సస్‌, అయోవా, మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, విస్కాన్సిన్‌ రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ 226 ఎలక్టోరల్‌ సీట్లను కైవసం చేసుకున్నారు.

 

Show comments