Site icon NTV Telugu

లావుగా ఉన్నార‌ని 140 మందిని ఆ ఉద్యోగాల నుంచి తొల‌గింపు…

కొన్ని ఉద్యోగాల‌కు బొద్దుగా ఉంటే పనికిరారు.  నాజూగ్గా, ఫిట్ గా ఉన్న‌వారికే ఆ ఉద్యోగాల్లోకి అనుమ‌తి ఉంటుంది.  ఒక‌వేళ ఉద్యోగం చేస్తున్న స‌మ‌యంలో లావుగా మారితే, తొల‌గించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.  ముఖ్యంగా ఎయిర్‌లైన్స్ ఉద్యోగాలు చేసే వారు త‌ప్ప‌నిస‌రిగా నాజూగ్గా క‌నిపించాలి.  లేదంటే వేటు త‌ప్ప‌దు.  

Read: ‘బిగ్ బాస్’ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన అంకిత లోఖండే

లావుగా ఉన్నారని పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ 140 మందిని విధుల నుంచి తొల‌గించింది.  ప‌లుమార్లు వారికి నోటీసులు ఇచ్చామ‌ని, అధిక బ‌రువు త‌గ్గించుకోవాల‌ని చెప్పినా విన‌క‌పోవ‌డంతో వారి పేర్ల‌ను జులై నెల‌కు సంబందించి ఫ్లైట్ డ్యూటి రోస్ట‌ర్ లిస్ట్ నుంచి తొల‌గించింది.  దీంతో 140 మంది సిబ్బంది పాక్ ఎయిర్‌లైన్ తీరుపై మండిప‌డుతున్నారు.  

Exit mobile version