Pakistan Economic Crisis: పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రభుత్వం ప్రజలకు నిత్యావసరాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ధరలు దారుణంగా పెరిగాయి. ఇక ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీని పొందేందుకు ఇబ్బదిముబ్బడిగా పన్నులను పెంచింది. దీంతో అక్కడ విద్యుత్, పెట్రోల్ రేట్లు పెరిగాయి. గతంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిందని వ్యాఖ్యానించాడు. తాజాగా దేశంలో ఎన్నికలు జరిపేందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ వద్ద డబ్బుల్లేవని వెల్లడించారు.
Read Also: Parrot : యజమానిని చంపిన వాళ్లను పట్టించిన చిలుక.. తొమ్మిదేళ్ల తర్వాత ఇద్దరికి జీవిత ఖైదు
ఇదిలా ఉంటే మరోసారి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సమచార శాఖ మంత్రి మర్రియం ఔరంగజేబ్ తో కలిసి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పీటీఐ నేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు గుప్పించారు. అతడిపై హత్యాయత్నం ఆరోపణలు అబద్ధమని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ మొదటగా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ రిటైర్డ్ ఖమర్ జావేద్ బజ్వా పదవీకాలన్నీ పొడగించి, ఆ తరువాత ఆయనను విమర్శిస్తున్నారని అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉన్న సమయంలో పీఎఎల్-ఎన్ నేతలను జైలులో పెట్టడాన్ని మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రస్తావించాడు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ లో ప్రతీ రోజు సంక్షోభాలు సృష్టిస్తున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తోందని, పాకిస్తాన్ త్వరలోనే ఈ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆయన అన్నారు.