Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pak Man Accused Of Blasphemy Dragged Out Of Jail Killed By Mob

Pakistan Jail Crime: పాక్‌లో దారుణం.. జైల్‌లో దూరి మరీ హత్య

Published Date :February 13, 2023 , 12:11 pm
By NTV WebDesk
Pakistan Jail Crime: పాక్‌లో దారుణం.. జైల్‌లో దూరి మరీ హత్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pak Man Accused Of Blasphemy Dragged Out Of Jail Killed By Mob: పాకిస్తాన్‌లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఒక నిందితుడ్ని.. కొందరు దుండగులు జైల్లో దూరి మరీ అతడ్ని చంపేశారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. స్టేషన్‌లో విధుల్లో ఉన్న పోలీసుల ముందే ఈ హత్య జరిగింది. వాళ్లు కనీసం అడ్డుకోకపోవడం గమనార్హం. చివర్లో ఆ మృతదేహానికి నిప్పు పెడుతున్న సమయంలో.. పోలీసులు అడ్డుకున్నారు. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

220 Couples Married: ఒకే వేదికపై 220 జంటల పెళ్లి.. ప్రతి జంటకు మంచం, పరపు, దుప్పట్లు, బీరువా..

మహ్మద్ వారిస్ అనే 20 ఏళ్ల యువకుడు దైవదూషణ (ఖురాన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు) ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. ఇతడ్ని నాంకన సాహిబ్ ప్రాంతంలో ఉండే జైల్లో ఉంచారు. పాకిస్తాన్‌ చట్టం ప్రకారం.. దైవదూషణ నేరం. దీనికి మరణశిక్ష కూడా విధిస్తారు. వారిస్ కూడా ఆ నేరం చేయడంతో, జైల్లో వేశారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుండగానే.. ఓ దుండగుల గుంపు అతడ్ని చంపేసింది. తొలుత ఓ గుంపు పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించింది. ఆ సమయంలో స్టేషన్‌లో కొంతమంది అధికారులు మాత్రమే ఉన్నారు. ఆ గుంపుని అడ్డుకునేలోపే.. వాళ్లు వారిస్‌పై దాడి చేసి చంపేశారు. అనంతరం అతని మృతదేహానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. అప్పుడు అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే ఆ గుంపుని అడ్డుకున్నారు.

Yevgeny Prigozhin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడే ఆగదు.. మరికొన్నేళ్లు సాగుతుంది

ఈ ఘటనపై వకాస్ పోలీస్ అధికారి మహ్మద్ వకాస్ మాట్లాడుతూ.. ‘‘ఉన్నట్లుండి ఓ గుంపు పోలీస్ స్టేషన్‌లోకి దూరింది. ప్రాంగణం నుండి వారిస్‌ని బయటకు తీసుకొచ్చి, అతనిపై దాడి చేసి చంపింది. ఆపై నిప్పు పెట్టడానికి కూడా ప్రయత్నించింది. స్టేషన్‌లో కొంతమంది అధికారులు ఉన్నందున వారిని అడ్డుకోలేకపోయారు. అయితే.. మృతదేహాన్ని తగలబెట్టకుండా గుంపును ఆపగలిగాయి’’ అని పేర్కొన్నారు. ఆ గుంపుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ఘటనపై ఓ వీడియోని చిత్రీకరించారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు.. ఆ గుంపుని అడ్డుకోవడంలో విఫలమైన పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.

Turkey Earthquake: 160 గంటలు శిథిలాల కిందే.. ఆ వ్యక్తి మృత్యువును జయించాడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • blasphemy
  • Pak Mob Killer Prisoner
  • Pakistan Crime
  • Prisoner Killed By Mob
  • Shehbaz Sharif

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions