Site icon NTV Telugu

Pakistan: వరదలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత పరిష్కారం.. ఏం చెప్పారంటే..

Pakistan

Pakistan

Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో వింత ప్రకటనలతో ట్రోలింగ్‌కి గురైన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుల్లో చాలా వరదలు వస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లో వరదలకు ఒక విచిత్రమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే పాకిస్తానీలు వరద నీటిని కాలువల్లోకి వెళ్లనివ్వకుండా కంటైనర్లలో ‘‘నిల్వ’’ చేయాలని ఆయన కోరారు. ఇదే కాకుండా ‘‘వరం’’గా చూడాలని కూడా ఆయన ప్రజల్ని కోరడం గమనార్హం.

Read Also: Home Minister Anitha : టెక్నాలజీ చేయలేని పనులను స్నిఫర్ డాగ్స్ చేసాయి

రుతుపవనాల కారణంగా పంజాబ్ ప్రావిన్సులో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీని వల్ల 2.4 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వెయ్యికి పైగా గ్రామలు మునిగిపోయాయి. పాకిస్తాన్ దునియా న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ..‘‘వరదలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలు వరద నీటిని ఇళ్లకు తీసుకెళ్లాలి’’ అని అన్నారు. ఈ నీటిని ప్రజలు తమ ఇళ్లలోని టబ్‌లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని సూచించారు. మెగా ప్రాజెక్టుల కోసం 10-15 ఏళ్లు వేచి ఉండకుండా, పాకిస్తాన్ త్వరగా పూర్తి చేయగలిగే చిన్న ఆనకట్టల్ని నిర్మించాలని ఆసిఫ్ సూచించారు.

జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు వరదల కారణంగా 854 మంది పాకిస్తానీయులు మరణించగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. చీనాబ్, రావి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చీనాబ్ వరద నీరు ముల్తాన్ జిల్లానున చేరుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ అంతటా వ్యవసాయ భూములు మునిగిపోవడం, కోతలకు సిద్ధంగా ఉన్న పంటలు నాశనం కావడం వల్ల దేశంలో ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

Exit mobile version