Site icon NTV Telugu

Pakistan: సింధు నది పేరుతో, పాకిస్తాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం..

Pak

Pak

Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల్ని మరింత పెంచుతూ పాక్ కవ్వింపులకు దిగుతోంది. ఇప్పటికే, గత 9 రోజులుగా ఎల్ఓసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ ‘‘బాలిస్టిక్ మిస్సైల్’’ని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. 450 కి.మీ పరిధి గల ఉపరితనం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణిని ప్రయోగించినట్లు పేర్కొంది. అబ్దాలి వెపన్ సిస్టమ్ అని పిలువబడే ఈ క్షిపణి మిలిటరీ విన్యాసాలకు ‘‘ఎక్సర్సైజ్ ఇండస్’’ అని పేరు పెట్టింది.

Read Also: YS Jagan: మద్దతు ధర కోసం రైతుల ఆందోళన.. సీఎం చంద్రబాబుకి జగన్ రిక్వెస్ట్!

సోన్మియాని రేంజ్‌లలో నిర్వహించిన ఈ పరీక్ష, అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణులను ప్రయోగించే ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్(ASFC) కింద నిర్వహించే ఆపరేషననల్ యూజర్ ట్రయల్స్‌లో భాగంగా ఉండొచ్చు. ఈ ప్రయోగాన్ని ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ షాబాజ్ ఖాన్, స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్‌లోని DG PDS మేజర్ జనరల్ షెహర్యార్ పర్వేజ్ బట్ వీక్షించారు.

‘‘సైనిక కార్యచరల సంసిద్ధతను నిర్ధారించడం, క్షిపణి అధునాతన నావిగేషన్ సిస్టమ్, క్షిపణి విన్యాసాల వంటి కీలకమైన టెక్నికల్ పెరామిటర్స్‌ని ధ్రువీకరించడం ఈ ప్రయోగం యొక్క లక్ష్యం’’ అని పాక్ ప్రభుత్వం తెలిపింది. దేశ జాతీయ భద్రతను కాపాడటానికి దళాల కార్యచరణ సంసిద్ధత, సాంకేతిక నైపుణ్యంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇతర సైనికాధికారులు పూర్తి విశ్వాసం ప్రకటించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Exit mobile version