Lebanon Pagers Explosion: లెబనాన్, సిరియాలపై మంగళవారం అనూహ్య మెరుపు దాడి జరిగింది. రెండు దేశాల్లో ఒకేసారి వందల పేజర్లు పేలుళ్లు జరిగాయి. ఫలితంగా 9 మంది మరణించారు. 2,750 మందికి పైగా గాయపడ్డారు. ఒక్క సిరియాలోనే ఏడుగురు మృతి చెందగా.. గాయపడిన వారిలో లెబనాన్‌లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్‌బొల్లా కీలక నేతలు కూడా ఉన్నారు. ఈ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్నాయి. పేజర్లు పేలిన ఘటనలో ఇద్దరు హెజ్‌బొల్లా సభ్యులు మృతి చెందగా.. ఒక ఎంపీ కుమారుడూ కూడా ఉన్నారు. అలాగే, ఇరాన్ రాయబారి భద్రతా సిబ్బంది దగ్గర ఉన్న పేజర్ పేలిపోయింది. తొలుత పేజర్లు వేడెక్కి.. ఆ తర్వాత పేలుళ్లు సంబంవించాయి. ఈ ఘటనలో హెజ్‌బొల్లా చీఫ్ నస్రుల్లాకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
Read Also: Astrology: సెప్టెంబర్ 18, బుధవారం దినఫలాలు
ఇక, ఈ పేజర్ల పేలుళ్లకు పాల్పడింది ఇజ్రాయెల్ పనేనని హెజ్‌బొల్లా ఆరోపణలు చేస్తోంది. పేజర్ల పేలుళ్లతో లెబనాన్‌లోని ఆసుపత్రులకు వేల మంది బాధితులు వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇది అతి పెద్ద భద్రతా వైఫల్యంగా హెజ్‌బొల్లా వెల్లడించింది. ఇజ్రాయెల్‌కు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రిమినల్ చర్యకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి కంప్లైంట్ చేస్తామని లెబనాన్ తెలిపింది. సెల్‌ఫోన్లు రాక ముందు సమాచారం అందజేయడానికి పేజర్లను వినియోగించేవారు.
Read Also: Ganesh Immersion : గ్రేటర్ పరిధిలో లక్ష 2 వేల 510 వినాయకుల నిమజ్జనం
కాగా, పేజర్ల విస్ఫోటంతో హెజ్‌బొల్లా నాయకులు, సలహాదారులు తీవ్రంగా గాయపడటం, దాదాపుగా అన్ని పేజర్లు ఒకేసారి పేలడాన్ని బట్టి ఇది సమన్వయంతో చేసిన దాడేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తుంది. లెబనాన్. రహస్య ఆపరేషన్లలో దిట్ట అయిన ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థలే ఈ పని చేసి ఉంటాయని డౌట్ పడుతున్నాయి. లెబనాన్‌లో హెజ్‌బొల్లా సొంత కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ టెలికం నెట్‌వర్క్‌లోకి ఇజ్రాయెల్ చొరబడి ఉంటుందని అనుమానిస్తుంది. గత అక్టోబరు నుంచి లక్షిత దాడుల్లో హెజ్‌బొల్లా కమాండర్లు అనేక మంది మరణించడమే ఇందుకు కారణం. తాజా ఘటనపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఇంకా రియాక్ట్ కాలేదు. ఈ దాడి ఎలా జరిగి ఉంటుందన్న దానిపై భిన్న వాదనలు ప్రచారం అవుతున్నాయి.