కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తున్నదో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కారణంగా ప్రతి నిమిషానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కరోనా మరణాల కంటే, ఆకలి చావులే అధికంగా ఉన్నట్టు ఆక్సోఫామ్ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. ఆక్సోఫామ్ సంస్థ పేదరిక నిర్మూలనకోసం పనిచేస్తున్నది. వైరస్ కారణంగా ప్రపంచంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, వివిధ దేశాల్లో అంతర్గత సమస్యలు, అంతర్గత ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది.
Read: గ్లోయింగ్ లుక్ తో మెరిసిపోతున్న సామ్… పిక్ వైరల్
పెరుగుతున్న పేదరికం, ఆకలి చావులపై ఈ సంస్థ ది హంగర్ వైరస్ మల్టిప్లైస్ పేరుతో నివేదికను రూపోందించింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచంలో 155 మిలియన్ల మంది అత్యంత దారుణమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ప్రతి నిమిషానికి 11 మంది ఆకలితో మరణిస్తున్నారని నివేదిక పేర్కొన్నది. ప్రకృతి విపత్తులు, కరోనాతో తీవ్రమైన ఆహారసంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే, దానికి తోడు కొన్ని దేశాల్లో అంతర్గత యుద్ధాలు మరింత శాపంగా మారాయని ఆక్సోఫామ్ సంస్థ తెలియజేసింది.
